అనుదీప్ సినిమాలో విశ్వాక్ సేన్ పాత్ర ఏంటో తెలుసా..?

జాతి రత్నాలు సినిమాతో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనుదీప్( Anudeep Kv )ఇక ఈ సినిమా తర్వాత తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు పొందిన శివ కార్తికేయన్ తో ప్రిన్స్ అనే సినిమా చేశాడు.

అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.అయినప్పటికీ అనుదీప్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.

ప్రస్తుతం ఆయన ఒక భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

"""/" / అందుకోసమే ఆయన రవితేజ కి ఒక కథ చెప్పినప్పటికీ ఆ కథ మెటీరియలైజ్ కాలేదు.

దాని వల్ల ఈ సినిమా అనేది ఆగిపోయింది.ఇక ఇప్పుడు ఆయన విశ్వక్ సేన్ తో ఒక భారీ ప్రాజెక్టును చేయాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో విశ్వక్( Vishwak Sen ) పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

మరి ఇప్పటికే హిట్ సినిమా( Hit )లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన విశ్వక్ సేన్ ఆ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చాడు.

మరి ఈ సినిమాలో కూడా తనదైన నటనను కనబరిచి మెప్పించి సినిమాని సక్సెస్ తీరాలకు చేరుస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక రీసెంట్ గా వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఆశించిన మేరకు విజయం అయితే అందుకోలేదు.

"""/" / ఇక దాంతో విశ్వక్ సేన్ మీద అభిమానుల్లో కొంతవరకు అంచనాలైతే తగ్గిపోయాయి.

అలాగే ఇంతకు ముందు వచ్చిన 'గామి ' సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఆయన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' విషయంలో మాత్రం కొంతవరకు డీలా పడ్డాడు మరిలా ఎందుకు జరిగింది అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతం విశ్వక్ సేన్ తనకంటూ మళ్లీ మార్కెట్ ను ఏర్పాటు చేసుకోవాలంటే అర్జెంటుగా తనకు ఒక హిట్ కావాలి.

కాబట్టి అనుదీప్ డైరెక్షన్ లో సినిమా చేస్తే మాత్రం హిట్ రావడమే కాకుండా తనకు తప్పకుండా మంచి పేరు కూడా వస్తుందని విశ్వక్ నమ్ముతున్నట్టుగా తెలుస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్8, మంగళవారం 2024