కాంతార సినిమా నటీనటుల రెమ్యూనరేషన్లు ఎంతో తెలుసా?

సాధారణంగా ఒక భాషలో వచ్చిన సినిమా మంచి విజయం సాధిస్తే ఆ సినిమాని ఇతర భాషలలో కూడా విడుదల చేయడం సర్వసాధారణం ఇలా కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి చిత్రం కాంతార.

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని అన్ని భాషలలో కూడా విడుదల చేశారు.

ఈ సినిమా కేవలం 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించగా ఏకంగా 250 కోట్ల రూపాయలను రాబట్టింది అంటే ఈ సినిమా ఎలాంటి క్రేజ్ సొంతం చేసుకుందో అర్థం అవుతుంది.

ఇలా అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా గురించి ఎంతోమంది ప్రశంసలు కురిపించారు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ నటి సంయుక్త గౌడ్ హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమాని కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంభలే ఫిలిమ్స్ నిర్మాణంలో కేవలం 16 కోట్ల రూపాయల నిర్మాణంతో తెరకెక్కింది.

ఇలా ఇండస్ట్రీ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో నటించిన నటీనటులు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త చెక్కర్లు కొడుతోంది.

"""/"/ ఈ సినిమా కోసం హీరో రిషబ్ శెట్టి నాలుగు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

అదేవిధంగా నటి సంయుక్త గౌడ్ 1.25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

ఈ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన కిషోర్ కోటి రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోగా, నెగిటివ్ పాత్రలో నటించిన అచ్యుత్ కుమార్ 75 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

ఇలా అత్యంత తక్కువ రెమ్యూనరేషన్లతో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా వందల కోట్ల కలెక్షన్లను రాబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

రుణమాఫీపై తీపి కబురు అందేనా…?