ఒక్క పాటకు సింగర్ మంగ్లీ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సింగర్ మంగ్లీ ఒకరు.

ఒకప్పుడు జానపద పాటలను పాడుతూ సోషల్ మీడియాలోనూ బుల్లితెర చానల్ లో సందడి చేస్తున్నటువంటి మంగ్లీ ప్రస్తుతం ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

ప్రస్తుతం ఈమె ప్రతి ఒక్క సినిమాలోని పాటలు పాడుతూ అభిమానులను సందడి చేస్తున్నారు.

మంగ్లీ పాడే పాటలకు కూడా ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.ఇలా ప్లేపాక్ సింగర్ గా మాత్రమే కాకుండా తన యూట్యూబ్ ఛానల్ కోసం కూడా ఈమె ప్రైవేట్ సాంగ్స్ పాడుతూ భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి.

"""/"/మంగ్లీ ఒక్కో పాట మిలియన్స్ సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి.కెరియర్ మొదట్లో ఒక్కో పాట కోసం ఈమె పదివేలు 20వేల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకునేవారు.

అయితే ప్రస్తుతం ఈమెకు చిత్ర పరిశ్రమలో భారీగా క్రేజ్ ఉండడంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయింది.

"""/"/ ఒకప్పుడు ఒక్కో పాటకు పదివేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే మంగ్లీ ఇప్పుడు తన రెమ్యూనరేషన్ పదింతలు పెంచేశారు.

ఈమే ఒక పాట కోసం లక్షకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.అలాగే ప్రతినెలా యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షల్లో ఆదాయం అందుకుంటుందని అలాగే ఇతర ఈవెంట్లలో సందడి చేయడం ద్వారా కూడా మంగ్లీ మంచి ఆదాయం అందుకుంటుందని తెలుస్తోంది.

ఒకప్పుడు కేవలం తెలుగు పాటలను ఆలపిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిమితమైన మంగ్లీ ప్రస్తుతం కన్నడ పాటలను పాడుతూ కన్నడ చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.

డంప్‌స్టర్ డైవింగ్ ద్వారా రూ.63 లక్షలు సంపాదించిన యూఎస్ మహిళ..?