బిగ్ బాస్ షణ్ముఖ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

షణ్ముఖ్ జస్వంత్.తెలుగులో మోస్ట్ పాపులర్ యూట్యూబర్.

మిలియన్ల కొంది వ్యూస్.లక్షల కొద్ది సబ్ స్క్రైబర్లతో యూట్యూబ్ ఐకాన్ గా మారిపోయాడు.

తను పోస్టు చేసే ప్రతి వీడియోకు భారీగా వ్యూస్ వస్తాయి.అంతేకాదు.

ఆయన విడుదల చేసే చాలా వీడియోలు టెండింగ్ లో కొనసాగుతాయి.సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ చేసిన తర్వాత ఈయనకున్న క్రేజ్ మరింత పెరిగింది.

సూర్య సిరీస్ తర్వాత ఇంకా మంచి పేరు తెచ్చుకున్నాడు.అంతకు ముందు కామెడీ షార్ట్ ఫిల్మ్ లు, డ్యాన్స్ వీడియోలు పోస్టు చేసే షణ్ముక్ వెబ్ సిరీస్ చేశాక.

ఎక్కడలేని ఆదరణ అందుకున్నాడు.సాఫ్ట్‌ వేర్ డెవలపర్ తర్వాత షణ్ముఖ్ యూట్యూబ్ సబ్‌ స్క్రైబర్స్ సంఖ్య మూడు మిలియన్లకు పెరిగిపోయింది.

సూర్య వెబ్ సిరీస్ తర్వాత తనకు సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.పది ఎపిసోడ్స్ గా ప్రసారం అయిన సూర్య వెబ్ సిరీస్.

యూట్యూబ్ లో దుమ్మురేపింది.తెలుగులో వచ్చిన మే సిరీస్ కు లేని రీతిలో వ్యూస్ వచ్చాయి.

ప్రతి ఎపిసోడ్ కు 10 మిలియన్లకు తగ్గకుండా వ్యూస్ సాధించింది.తాజాగా ఈ కుర్రాడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఈ షోలోకి వచ్చేందుకు తను భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈ షో కోసం ఏకంగా కోటి రూపాయలు తీసుకుంటున్నట్లు సమాచారం.

ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంత భారీగా రెమ్యునరేషన్ ఎవరికీ ఇవ్వలేదట.

సోషల్ మీడియాలో ఆయనకున్న క్రేజ్ ను బిగ్ బాస్ హౌస్ కు ప్లస్ అవుతుందనే నిర్వాహకులు ఆయనకు భారీగా సొమ్ము ముట్టజెప్పేందుకు ఓకే అన్నారట.

"""/"/ తాజాగా షణ్ముఖ్ డ్రంక్ అన్ డ్రైవ్‌లో పట్టుబడ్డాడు.అయినా ఈ ఘటన జరిగిన దగ్గర్నుంచి చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు.

తాజాగా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టాడు.ఇంత వరకు సోషల్ మీడియా ద్వారా జనాలను ఆదరించిన కుర్రారు.

ఇకపై బుల్లితెరపై సందడి చేయనున్నాడు.బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడుతూనే హు ఆర్ యూ అనే పాటకు డ్యాన్స్ వేసి అరదగొట్టాడు.

అటు యూట్యూబ్, వెబ్ సిరీస్ ల ద్వారా తను నెలకు ఏడు, ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తాడు.

అందుకే దానికి సరిపోయేలా బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఆయనకు భారీగా డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

లాస్ ఏంజెల్స్ అగ్నిప్రమాదం .. బాధితులకు సిక్కు కమ్యూనిటీ ఆపన్నహస్తం