ఉప్పుకి ఐశ్వర్యానికి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
TeluguStop.com
సాధారణంగా మన హిందూ శాస్త్రాల ప్రకారం ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము.అందుకే ఉప్పు తొక్క కూడదనీ, ఉప్పును బయటపడేయకూడదని చెబుతుంటారు.
అలాగే సంధ్యా సమయంలో ఉప్పును ఇతరులకు దానం కూడా చేయకూడదని చెబుతారు.ఇలా దానం చేయటం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుందని అందుకే ఉప్పును ఎంతో పవిత్రంగా భావిస్తారు.
అయితే ఉప్పుకి లక్ష్మీదేవికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ఎందుకు ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు అనే విషయానికి వస్తే.
పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగర మధనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి లక్ష్మిదేవి ఉద్భవించింది.
కనుక అదే సముద్రగర్భం నుంచి మనకు ఉప్పు కూడా తయారవుతుంది కనుక ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు.
అందుకే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఉప్పుతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించే సకల సంపదలను కలిగిస్తుందని భావిస్తారు.
ఇక ఉప్పు లక్ష్మీదేవి ప్రతి రూపం కనుక ఇతరులకు దానమివ్వకూడదు ఇలా ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మనమే స్వయంగా బయటకు పంపినట్లు అవుతుంది.
అదేవిధంగా ఉప్పును తొక్కుతూ అవమానించ కూడదు.ఇక ప్రతి రోజు శుక్రవారం ఉదయం ఒక గ్లాసు నీటిలో ఉప్పు వేసి మన ఇంట్లో అనుకూలంగా ఉన్న మూలలో పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది.
ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.ఇక మంగళవారం లేదా శుక్రవారం మన ఇంటికి ఎవరైనా ముత్తయిదువులు వస్తే ముందుగా వారిని చాపపై కూర్చోబెట్టి వారికిమంచినీళ్లు ఇచ్చిన అనంతరం పసుపుకుంకుమలు పండు తాంబూలం ఇవ్వడం వల్ల సకల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
కొందరు ఎర్రటి గుడ్డలో రాళ్ల ఉప్పు వేసిఇంటి ప్రధాన ద్వారం ముందు కట్టాలి మరుసటిరోజు ఆ ఉప్పు తీసుకెళ్లి ఎవరూ తొక్కని ప్రదేశములో వేయటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి.
బీసీ కుల గణన వెనుక అసలు వ్యూహం ఇదా ?