ప్రభాస్ కల్కి సినిమాకి, సుమంత్ ‘మహేంద్ర గిరి వారాహి’ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.

అందులో సుమంత్( Sumanth ) ఒకరు.నిజానికి ఆయన చేసిన కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడం లో కొంతవరకు తడబడ్డప్పటికి నటుడిగా మాత్రం ఆయన అత్యున్నతమైన స్థాయిలో ఉన్నాడనే చెప్పాలి.

ప్రస్తుతం ఆయన 'మహేంద్రగిరి వారాహి'( Mahendragiri Varahi ) అనే సినిమా చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాతో తన స్థాయికి తగ్గ సక్సెస్ ను కొట్టబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక గత కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన 'మహేంద్రగిరి వారాహి' సినిమా టీజర్ ని కనక మనం చూసినట్లైతే ఈ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ పాత్రలో నటిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

అలాగే ఈ సినిమా 'వారాహి మాత' ( Varahi Mata )గొప్పతనాన్ని తెలిపే విధంగా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

మరి మొత్తానికైతే సుమంత్ ఈ సినిమాతో మరోసారి తన స్టార్ డమ్ ను విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే 'మహేంద్రగిరి వారాహి' సినిమా దర్శకుడు అయిన 'సంతోష్ జాగర్లపూడి' సుమంత్ తో ఇంతకుముందు 'సుబ్రహ్మణ్యపురం '( Subrahmanyapuram ) అనే సినిమా చేసి ఒక డీసెంట్ హిట్టును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక మరోసారి వీళ్ళ కాంబోలో 'మహేంద్ర గిరి వారాహి ' అనే సినిమా రావడం నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి.

ఇక ఈ సినిమా అవుట్ పుట్ అద్భుతంగా వచ్చే విధంగా దర్శకుడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని చాలా టాప్ లెవెల్లో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన 30% షూట్ ని కంప్లీట్ చేశారు.ఇక తొందర్లోనే మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.

"""/" / ప్రస్తుతం దేవుళ్ళ మీద దేవతల మీద అలాగే దేవాలయాల మీద సినిమాలు వచ్చి మంచి సక్సెస్ లను అందుకుంటున్నాయి.

అయితే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ అయిన ప్రభాస్ కూడా 'కల్కి ' ( Kalki )లాంటి ఒక భారీ సినిమా తో సక్సెస్ ను అందుకున్నాడు.

ఇక కల్కి సినిమా కూడా మహాభారతం ఆధారంగా తెరకెక్కిన సినిమా అనే విషయం మనకు తెలిసిందే.

కాబట్టి పురాణాలు, దైవభక్తి మీద వచ్చే సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.ఇక ఇలాంటి సందర్భం లో 'మహేంద్ర గిరి వారాహి' కూడా సూపర్ సక్సెస్ అవుతుందని అటు సుమంత్, ఇటు 'సంతోష్ జాగర్లపూడి' ఇద్దరు చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉన్నారు.

"""/" / ఇక ఇప్పటికే పలు పెద్ద నిర్మాణ సంస్థల నుంచి అడ్వాన్సులను కూడా తీసుకున్న సంతోష్ జాగర్లపూడి ఈ సినిమా సక్సెస్ తో ప్రస్తుతం ఉన్న యంగ్ డైరెక్టర్లందరిలో టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక అలాగే ఈ సినిమా తర్వాత దర్శకుడు మరో రెండు పెద్ద హీరోల సినిమాలను కూడా లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

డైరెక్షన్ కి కొత్త అర్థాన్ని చెబుతున్న దర్శకుడు సంతోష్ జగర్లపూడి… సినిమా కోసం ఏదైనా చేసేస్తాడా..?