గంగాజలన్నీ తులసి ఆకులను పూజలో ఉపయోగించడానికి గల కారణాలు తెలుసా..

మన దేశవ్యాప్తంగా ఎన్నో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలలో ప్రతిరోజు ఎంతోమంది భక్తులు వచ్చి పూజలు కూడా చేస్తూ ఉంటారు.

ఆ పూజలలో ఖచ్చితమైన కొన్ని వస్తువులను ఉపయోగించాలని నియమం ఉంటుంది.అలాంటి వస్తువులను ఎంతో జాగ్రత్తగా పవిత్రంగా ఖచ్చితమైన ఒక ప్రదేశంలో ఉంచి దేవాలయానికి తీసుకురావాలి.

చాలా రకాల పూజల లో గంగాజలాన్ని, తులసి ఆకులను కూడా ఉపయోగిస్తూ ఉంటారు.

ఎందుకంటే దేవుళ్లకు పూజలు చేసేటప్పుడు ఈ రెండు కచ్చితంగా ఉండాల్సిందే.పూజ పళ్లెంలో నైవేద్యాలను అమర్చడానికి తులసి ఆకులు కచ్చితంగా ఉండాల్సిందే.

సనాతన ధర్మంలోని అన్ని పూజలలో గంగా జలానికి ప్రత్యేకమైన పాత్ర కచ్చితంగా ఉండాలి.

తులసి గంగాజలం చాలామంది ప్రజలు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.చాలా మంది ప్రజలు తులసి ఆకులు గంగాజలంతో అనేక ఆచారాలను కఠినంగా పాటిస్తారు.

కానీ పూజ సమయంలో ఈ రెండు ఎందుకు తప్పనిసరి అనే విషయం చాలామందికి తెలియదు.

దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. """/"/ గంగా జలాన్ని భగవంతుని ప్రసాదం, చరణామృతం అని చాలామంది భక్తులు చెబుతూ ఉంటారు.

తులసి ఆకులు లేనిదే పూజ అసలు పూర్తికాదు.పూజా సమయంలో గంగాజలంలో తులసి ఆకులు కూడా వేస్తారు.

సనాతన ధర్మం ప్రకారం తులసి ఆకులు ఎంతో పవిత్రమైనవి.ఆ ఇంట్లో తులసి మొక్క ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కచ్చితంగా ఉంటుందని నమ్మేవారు ఉన్నారు.

దీనితో పాటు మహావిష్ణువు ఆశీర్వాదం కూడా లభిస్తుందని గట్టి నమ్మకం.గంగా జలం తులసి ఆకులతో కలిసిన నీటిని రాగి పాత్రలో ఉంచితే ఆ నీరు అమృతం లాగే స్వచ్ఛంగా, పవిత్రంగా మారుతుందని చాలామంది నమ్మకం.

అందుకే చాలామంది పంచామృతానికి బదులుగా గంగాజలం తులసి ఆకులను కూడా ఇస్తూ ఉంటారు.

సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను ముట్టుకోవడం అంత మంచి విషయమేమీ కాదు.తులసి దేవి ఎప్పుడు పరిశుభ్రతను ఎక్కువగా ఇష్టపడుతుంది.

అంతేకాకుండా మంగళ, ఆదివారాలలో తులసి మొక్కను ముట్టుకోకూడదు.

చలికాలంలో అరటిపండు తినడం మంచిదేనా..?