నారద మహర్షి పురందరదాసుగా.. ప్రసిద్ది చెందడానికి కారణం ఏమిటో తెలుసా..?

సకల దేవతలలో నారదుడికి ప్రత్యేక స్థానం ఉంది.నారదుడు దేవతల మధ్య అటు వార్తలను ఇటు చేరవేయడంలో, ఇటు వార్తలను అటు చేరవేస్తూ అందరి మధ్య కలహాలను సృష్టిస్తాడు.

అదేవిధంగా నారదుడు సాక్షాత్తూ నారాయణుడికి పరమభక్తుడు.ఎల్లప్పుడు నారాయణుడి నామస్మరణ చేస్తూ విష్ణుమూర్తికి పరమభక్తుడుగా పేరుగాంచాడు.

అదేవిధంగా ఈ నారదమహర్షి పురంధరదాసుగా కూడా ప్రసిద్ధి చెందాడు.ఈ విధంగా నారదుడు పురందరుడుగా ప్రసిద్ధి చెందడం వెనుక ఒక కథ ఉంది.

అది ఏమిటో తెలుసుకుందాం.పురాణాల ప్రకారం మైసూరు రాజ్యంలో శ్రీనివాసుడు అనే నగల వ్యాపారి వుండేవాడు.

అతనికి బంగారం మీద విపరీతమైన వ్యామోహం ఉండేది.ఎంతో సంపన్నుడైన ఆ వ్యాపారి దగ్గరకు ఒకరోజు ఓ వృద్ధుడు వచ్చి తనకు సహాయం కావాలని కోరుతాడు.

అందుకు శ్రీనివాసుడు తనకు సహాయం చేయడానికి తన దగ్గర ఏమీ లేదు అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని చెబుతాడు.

కొద్దిసేపటి తర్వాత శ్రీనివాసుడు తన ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ వృద్ధుడు శ్రీనివాసుడి భార్యను ఏదైనా సహాయం చేయమని కోరుతాడు.

శ్రీనివాసుడి భార్య ఎంతో దయా హృదయం కలది.ఆ వృద్ధుడిపై జాలి కలిగిన ఆమె తన ముక్కుకు ఉన్న వజ్రపు ముక్కు పుడక తీసి ఆ వృద్ధుడికి దానం చేస్తుంది.

దీనిని తీసుకొని నీ అవసరం తీర్చుకోమని చెబుతుంది.ఆ వృద్ధుడు ఆ వజ్రపు ముక్కుపుడకను తీసుకొని సరాసరి శ్రీనివాసుడు నగల దుకాణానికి వెళ్తాడు.

అయితే ఆ ముక్కుపుడక చూసిన శ్రీనివాసుడు అది తన భార్య దేనని గుర్తించి ఆ వృద్ధుని అక్కడే ఉండమని చెప్పి ఎంతో ఆగ్రహంతో ఇంటికి వస్తాడు.

అయితే తన భర్త ఆగ్రహంతో ఇంటికి రావడం చూసిన భార్య ఈరోజు తన ప్రాణాలు తీయడం ఖాయమని భావించి విషం తాగడానికి గిన్నెను తీసుకోగా అందులో ఆమెకు వజ్రపు ముక్కుపుడక దర్శనమివ్వడంతో ఎంతో ఆశ్చర్యానికి గురైన ఆమే ఆ ముక్కుపుడకను పెట్టుకొని తన భర్తకు కనబడుతుంది.

భార్య ముక్కుకు ఉన్న ముక్కుపుడకను చూసిన శ్రీనివాసుడు ఇదంతా కేవలం దైవలీల అని భావిస్తాడు.

అప్పటినుంచి శ్రీనివాసుడు తన దగ్గర ఉన్న సొమ్ము మొత్తం పేదలకు దానధర్మాలు చేస్తూ శ్రీనివాసుడు పురందరదాసుగా ప్రసిద్ధికెక్కాడు.

పురంధరదాసు మరెవరో కాదు సాక్షాత్తు ఆ నారదమహర్షి,అదేవిధంగా వృద్ధుడి రూపంలో నారదుడు ను పరీక్షించడానికి వచ్చింది స్వయానా నారాయణుడే.

అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ఆరోజే పెళ్లి బాజాలు మోగనున్నాయా?