హిట్ అయిన సినిమాలు రీ రిలీజ్ లో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం తెలుగులో స్టార్ హీరోల సినిమాలను రీ రిలీజ్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తున్నారు.

మరి ఆ సినిమాలను చూడ్డానికి ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన చేసిన మగధీర సినిమాను( Magadheera Movie ) రీ రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు.ఇక ఎన్టీఆర్ సింహాద్రి సినిమాని( Simhadri Movie ) కూడా రీ రిలీజ్ చేసిన కూడా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు.

ఇక రీ రిలీజ్ సినిమాల మీద ప్రేక్షకుల దృష్టి అనేది పూర్తిగా తగ్గిపోతుందనే వార్తలు కూడా వస్తున్నాయి.

"""/" / ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా( Orange Movie ) డిజాస్టర్ అయింది.

కానీ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే మాత్రం సూపర్ సక్సెస్ అయి భారీ వసూళ్లను కలెక్ట్ చేసింది.

ఇక ఆనంద్ రంగ డైరెక్షన్ లో వచ్చిన ఓయ్ సినిమా( Oy Movie ) కూడా మొదటిసారి రిలీజ్ చేస్తే ఫ్లాప్ అయింది.

కానీ రీరిలీజ్ లో మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంది.ఇక ఇలాంటి సినిమాలు ముందు రిలీజ్ చేసినప్పుడు ఫ్లాప్ అయినప్పటికి రీ రిలీజ్ చేస్తున్న సమయంలో హిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఒరిజినల్ రిలీజ్ చేసినప్పుడు హిట్ అయిన సినిమాలు ఇప్పుడు ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే అప్పటికి ఇప్పటికీ ఒక సినిమా చూసే ప్రేక్షకుడి దృష్టి అనేది పూర్తిగా మారిపోయింది.

"""/" / ఆల్రెడీ హిట్ అయిన సినిమాని చాలాసార్లు చూసి ఉంటారు.కాబట్టి ఆ సినిమాను చూడడానికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

అందువల్లే ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.కాబట్టి వాటిని చూడడానికి ప్రేక్షకులు విపరీతమైన ఆసక్తిని చూపిస్తూ ముందుకు కదులుతున్నారు.

దానివల్లే ఆరంజ్, ఓయ్ లాంటి సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి.

మగధీర, సింహాద్రి లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

ఆ 3500 రూపాయలు నేనే అడిగాను.. వైరల్ అవుతున్న రేణూ దేశాయ్ కామెంట్స్!