వసంత పంచమి రోజు విద్యాభ్యాసం చేయించడానికి కారణం ఏంటో తెలుసా?

మాఘ మాసం శుక్లపక్ష 5వ రోజున ప్రతి ఏడాది వసంత పంచమిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఇలా వసంత పంచమి రోజు పెద్దఎత్తున సరస్వతి దేవి ఆలయానికి భక్తులు తరలి వెళ్లి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.

అక్షరానికి జ్ఞానానికి అధిదేవతగా భావించే సరస్వతీ దేవిని పూజించడం వల్ల జ్ఞానం లభిస్తుందని పురాణాలు తెలియజేశాయి.

సరస్వతి శబ్దానికి ప్రవాహం రూపంలో ఉండే జ్ఞానం అని అర్థం.అందుకే సరస్వతీ దేవిని పూజించడం వల్ల అపారమైన జ్ఞానం కలుగుతుందని భావిస్తారు.

అందు కోసమే పెద్ద ఎత్తున వసంత పంచమి రోజు ప్రతి ఒక్క తల్లిదండ్రి వారి చిన్నారులకు విద్యాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తారు.

సరస్వతి దేవి జయంతి రోజైన వసంత పంచమి రోజు ఈ విధంగా విద్యాభ్యాసం చేయించడం వల్ల వారి పిల్లలు ఎంతో విద్యావంతులు బుద్ధిమంతులు అవుతారని భావించడం వల్ల చాలా మంది ఈ రోజు పెద్ద ఎత్తున బాసర సరస్వతి ఆలయానికి చేరుకుని అమ్మ వారికి ప్రత్యేక పూజలలో పాల్గొని తమ పిల్లలకు విద్యాభ్యాసం చేస్తారు.

"""/" / అయితే బాసర వెళ్ళలేని వారు ఏదైనా ఆలయంలో పండితుల చేత విద్యాభ్యాసం చేయించడం లేదా పాఠశాలలో కూడా ఇలా విద్యాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఈ విధంగా వసంత పంచమి రోజు అమ్మవారిని తెల్లటి పుష్పాలతో పూజించి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరాన్నం, నారికేలము, చెరుకుగడలు, అరటి పండ్లు వంటి వాటిని ప్రసాదంగా సమర్పించి పూజించడం వల్ల మనకు సకల జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు.

గుజరాత్ మీద ఢిల్లీ క్యాపిటల్స్ విజయానికి కారణం ఇదే…