మహేష్ బాబు సినిమా పూజా కార్యక్రమాలకు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు( Mahesh Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మహేష్ బాబు ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఇలా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలు పెద్ద ఎత్తున సెంటిమెంట్లను నమ్ముతూ ఉంటారు.

అలాంటి సెంటిమెంట్ ( Sentiment ) మహేష్ బాబు కూడా ఉన్నాయని తెలుస్తోంది.

"""/" / ప్రతి విషయాన్ని చాలా లైట్ గా తీసుకునే మహేష్ బాబు కూడా ఇలాంటి సెంటిమెంట్లను నమ్ముతారా అన్న ఆశ్చర్యం ప్రతి ఒక్కరికి కలగక మానదు అయితే ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

మరి మహేష్ బాబు తన సినిమాల విషయంలో పాటించ సెంటిమెంట్ ఏంటి అనే విషయానికి వస్తే సినిమా ప్రారంభమైన తర్వాత పూజా కార్యక్రమాలలో మహేష్ బాబు పాల్గొనరు.

అదే ఆయన సెంటిమెంట్.పూజ కార్యక్రమం ప్రారంభమయ్యే రోజు మహేష్ బాబు పొరపాటున కూడా ఆ పూజ కార్యక్రమాలలో పాల్గొనరని తెలుస్తుంది.

తాజాగా మహేష్ బాబు త్రివిక్రమ్ ( Trivikram ) సమంత ( Samantha )మధ్య జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయం బయటపడింది.

ఇది ఓల్డ్ వీడియో అయినప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా గురించి మాట్లాడుతూ ఆయన ఓ సినిమాకు కమిట్ అయ్యారని పూజ కార్యక్రమాలకు రాలేదని సినిమా షూటింగ్ మొదలైన మొదటి రోజు కూడా రాకపోవడంతో అసలు ఈ సినిమాలో మీరు నటిస్తున్నారా అన్న సందేహం నాకు కలిగింది అంటూ త్రివిక్రమ్ చెప్పారు.

"""/" / త్రివిక్రమ్ మాటలకు సమంత అందుకొని అవును మహేష్ బాబు గారు దూకుడు సినిమా పూజ కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదు అని చెప్పగా వెంటనే మహేష్ బాబు అలా హాజరు కాకపోవడం నా సెంటిమెంట్ అంటూ ఇండస్ట్రీలో తన సినిమాల విషయంలో తనకు ఉన్నటువంటి సెంటిమెంట్ గురించి బయటపెట్టారు.

ఈ విషయం తెలిసిన తర్వాత అవును నిజమే మహేష్ బాబు తాజాగా జరిగిన గుంటూరు కారం ( Gunturu Kaaram ) సినిమా పూజా కార్యక్రమాలకు కూడా హాజరు కాలేదని ఈ కార్యక్రమాలలో నమ్రత( Namrata )హాజరయ్యారు అంటూ నేటిజన్స్ కూడా ఈ విషయాలను గుర్తు చేసుకున్నారు.

ఇలా మహేష్ బాబు గురించి ఈ విషయం తెలియడంతో మహేష్ కూడా ఇలాంటి సెంటిమెంట్లను నమ్ముతారా అని సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?