హోమాలు ఎందుకు చేస్తారు..? దీని వెనుక ఉన్న పెద్ద రహస్యం ఏంటో తెలుసా..?

హోమాలు ( Homam ) లాంటివి ఎక్కువగా మనం చాలామంది ఇంట్లో చూస్తూనే ఉంటాం.

ఇక దేవాలయంలో కూడా చాలామంది హోమాలు చేస్తూ ఉంటారు.అసలు హోమాలు ఎందుకు చేయాలి? హోమం వలన మనకు ఎలాంటి ఫలితం ఉంటుంది అని చాలామంది సందేహ పడుతుంటారు.

అయితే హిందూ మత విశ్వాసం ప్రకారం హోమానికి చాలా ప్రత్యేకత ఉంది.ఎవరి జాతకంలో అయిన దోషం( Dosham ) ఉంటే దానికి పరిహారంగా హోమాన్ని చేస్తారు.

అప్పుడు కచ్చితంగా దోషానికి పరిహారం వలన మంచి ఫలితం ఉంటుంది.అలాగే చాలామంది సకాలంలో వర్షాలు కురవాలని కూడా హోమాన్ని చేస్తుంటారు.

"""/" / ఇక ఆర్థిక సమస్యలు ఉన్నవారు కూడా గణపతి హోమాన్ని( Ganapati Homam ) చేస్తూ ఉంటారు.

అంతేకాకుండా శివ హోమాన్ని( Shiva Homam ) కూడా చాలా మంది చేస్తూ ఉంటారు.

పెళ్లిళ్లు క్యాన్సల్ అయిన శివ హోమం చేస్తూ ఉంటారు.ఇక విద్యలో వెనుకబడినట్లైతే సరస్వతీదేవి హోమాన్ని( Saraswati Devi Homam ) చేస్తారు.

ఇక దక్షిణామూర్తి హోమం, విద్యా గణపతి హోమం, సిద్ధి గణపతి హోమాలని కూడా చాలామంది చేస్తూ ఉంటారు.

అయితే కొంతమంది ఎదుటివాళ్ల నుండి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మహా సుదర్శన హోమాన్ని చేస్తూ ఉంటారు.

"""/" / ఇక కుబేర లక్ష్మి హోమాన్ని( Kubera Lakshmi Homam ) చేసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది.

ఈ హోమం చేయడం వలన ఆర్థిక బాధలు కూడా ఉండవు.ఇక చాలామంది ధన్వంతరి హోమం( Dhanvantari Homam ) కూడా చేస్తూ ఉంటారు.

ఈ హోమం చేయడం వలన వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు.ఈ హోమం చేస్తే అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.

అందుకే చాలామంది ఇలా హోమాలతో చక్కటి పరిష్కారం కనబడుతుందని ప్రతి ఒక్కరు కూడా హోమాన్ని జరుపుతూ ఉంటారు.

హోమాలని ఎంత ఖర్చు అయినా పెట్టి చాలా వైభవంగా చేస్తూ ఉంటారు.

వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!