నటి మృణాల్ ఠాకూర్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన నటీమణులు డాక్టర్ కావాలనుకున్నాను కానీ యాక్టర్ అయ్యాను అంటూ ఎంతోమంది చెప్పిన సమాధానం మనం వినే ఉన్నాం.

అయితే చాలామంది నటీనటులు ఎంతో ఉన్నతమైన చదువులు చదువుకొని వారికి ఎంతో ఇష్టమైన సినిమా రంగంలోకి వచ్చి నటీనటులుగా స్థిరపడుతున్నారు.

ఈ క్రమంలోనే సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ అందరికీ ఎంతో సుపరిచితమయ్యారు.

మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

సీతారామం సినిమా మంచి విజయం సాధించిన అనంతరం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన క్వాలిఫికేషన్ గురించి తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా మృణాల్ తాను డెంటల్ కోర్స్ చేశానని, అలా డాక్టర్ అయినటువంటి ఆమె యాక్టర్ అయ్యానని చెప్పారు.

తనకు సినిమాలపై ఆసక్తి ఉండటం వల్ల తాను సినీ రంగంలోకి వస్తానని చెప్పగా తన తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదని ఈ సందర్భంగా ఈమె తెలిపారు.

"""/"/ తల్లిదండ్రులు కాదనడంతో ఈమె తన తల్లిదండ్రులు ఇద్దరినీ కూర్చోబెట్టి త్రీ ఇడియట్ సినిమా ఎన్నోసార్లు చూపించానని అందులో పిల్లలకు ఇష్టమైన రంగాన్ని ఎంపిక చేసుకునే విధానం ఎంతో అద్భుతంగా చూపించారు.

ఈ సినిమా చూసిన తర్వాత తన తల్లిదండ్రులు కూడా తాను కచ్చితంగా డాక్టర్ కోర్సులో స్థిరపడాలని కాకుండా నాకు ఇష్టమైన సినిమా రంగంలో కొనసాగడానికి అనుమతి తెలిపారని ఇలా తాను ఇండస్ట్రీలోకి వచ్చానని ఈ సందర్భంగా మృణాల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వైరల్ వీడియో: మాంసం తీసుకొచ్చాడని ఏడేళ్ల చిన్నారిని స్కూల్ నుంచి సస్పెండ్ చేసిన ప్రిన్సిపాల్..