Prabhas : ప్రభాస్ ధరించిన ఈ జాకెట్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే!

టాలీవుడ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.

ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పానీ ఇండియా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

అందులో భాగంగానే ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం కల్కి( Kalki ) సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు.

అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తు ఉంది.

శరవేగంగా షూటింగ్ ని కూడా జరుపుకుంటుంది.దీపికా పదుకొణె హీరోయిన్ గా చేస్తుండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి నట దిగ్గజాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

"""/" / మే 9 2024న వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ కాబోతుంది.

వైజయంతి మూవీస్ పతాకంపై( Vyjayanthi Movies ) అశ్వని దత్ నిర్మిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.

ఈ సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తున్నారు.కాగా ఈ మూవీలోని కొన్ని కీలక సన్నివేశాలతో బిజీగా ఉన్నారు.

వాస్తవానికి ప్రభాస్ ఇప్పటికే ఈ మూవీ కోసం ఒక రొమాంటిక్ పాటను కూడా కంప్లీట్ చేశారు.

బాలీవుడ్ నటి దిశా పటానీ తో కలిసి ఇటలీలో చిత్రీకరించారు.ఇటలీలో కల్కి సెట్స్ ను ప్రభాస్, దిశా పటానీ ఫోటోను నిన్న మేకర్స్ రిలీజ్ చేశారు.

"""/" / అయితే బర్బెర్రీ జాకెట్( Burberry Jacket ) ధరించి కనిపించి ఆకట్టుకున్నాడు.

ఈ జాకెట్ గ్లామరస్ గా కనిపించాడు ప్రభాస్.అయితే ప్రభాస్ ధరించిన జాకెట్ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

ఆ బ్లాక్ కోటు ధర దాదాపు రూ.76 వేల కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం.

ఈ వార్త వైరల్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.డార్లింగ్ క్రేజే వేరు అని కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు ఏంటి ఓన్లీ ఆ కోటు ద్వారా 76,000 వేలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కొందరు ఇంకా ప్రభాస్ నయం కొంతమంది ఏకంగా లక్షలు విలువ చేసే దుస్తులు ధరిస్తూ ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.