ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇండియాలో నిరుద్యోగ శాతం ఎంతో తెలుసా?

మనదేశ నిరుద్యోగం( Unemployment ) గురించి నిరుద్యోగులమైన మనకంటే ఇంకెవ్వరికి బాగా తెలుస్తుంది? అలాంటి మనల్ని ఎవరన్నా ఏం చేస్తున్నావు? మీ జీతమెంత? అని అడిగితే ఎక్కడో కాలుతుంది.

ఇక్కడ చదువుకున్నవాడు అంటే ప్రతి ఒక్కరికీ లోకువే మరి.ఇక్కడ ఎన్ని డిగ్రీలు చేసినా వుద్యోగంరాని పరిస్థితి వుంది.

ఇక అసలు విషయంలోకి వెళితే, ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల సగటు జీతం ఎంత? అనే విషయంపైన వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఒక నివేదిక రూపొందించగా నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి.

"""/" / దీని ప్రకారం ప్రపంచంలోని 23 దేశాల్లో సగటు జీతం లక్ష రూపాయల కన్నా ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.

దాదాపు 104 దేశాల్లో సర్వే చేయగా.టాప్‌ ప్లేసులో స్విట్జర్లాండ్‌( Switzerland ) (రూ.

4,98,567) ఉంటే, అత్యంత దిగువ స్థాయిలో పాకిస్థాన్‌ (రూ.11,858) ఉంది.

ఇక మన పరిస్థితికి వస్తే, భారత్‌తో సగటు జీతం రూ.46,861 మాత్రంగానే వుంది.

ఇదేమంత మంచి ఫిగర్ కాదని చెబుతున్నాయి గణాంకాలు.ఆయా దేశాల్లో ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకొని.

ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. """/" / ఇక నిరుద్యోగుల గురించి చూస్తే, మిగతాదేశాలతో పోలిస్తే, నైజీరియాలో నిరుద్యోగం రాజ్యమేలుతోందని చెబుతున్నారు.

వరల్డ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకారం ఖతార్‌లో కూడా అత్యల్పంగా ఉంది.అదేవిధంగా భారతదేశంలో గత 3 దశాబ్ధాలుగా నమోదైన దానికంటే ఈసారి నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉందని సమాచారం.

1991నాటి ఆర్థిక సంక్షోభం సమయంలో కూడా ఇలా లేదు అని వరల్డ్ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనమిస్ట్ కౌశిక్ బసు( Kaushik Basu ) అన్నారు.

బంగ్లాదేశ్( Bangladesh ) (5.3 %), మెక్సికో (4.

7 %), వియత్నాం (2.3 %) లాంటి అభివృద్ధి చెందుతోన్న దేశాల కంటే కూడా భారత్‌లో ఈ నిరుద్యోగం రేటు అధికంగా ఉండడం ఒకింత బాధాకరం.

వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!