మూడు భాషల్లో మూడు వందల రోజులు ఆడిన సినిమా ఏదో మీకు తెలుసా?

ఒక భాషలో ఒక సినిమా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటే ఆ సినిమా వంద రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఆడుతుంది.

ఎందుకంటే సినిమా సక్సెస్ అలాంటిదన్నమాట.ప్రేక్షకులను ఒక బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మెప్పించిందంటే చాలు థియేటర్ లలో కొన్ని రోజుల వరకు ఆ సినిమా హవానే నడుస్తుంది.

అలా ఇతర భాషల్లో విడుదలైన కూడా కొన్ని కొన్ని సార్లు అటువంటి సక్సెస్ నే అందుకుంటుంది.

అలా ఓ సినిమా కూడా మూడు బాషల్లో మూడు వందల రోజులు ఆడింది.

ఇంతకు ఆ సినిమా ఏంటో తెలుసుకుందాం.2005లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తెలుగు డబ్బింగ్ సినిమా చంద్రముఖి.

ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించాడు.అంతేకాకుండా నయనతార, ప్రభు, జ్యోతిక, వినీత్, నాజర్, సోనూసూద్ తదితరులు నటించారు.

ఈ సినిమాకు పి.వాసు దర్శకత్వం వహించాడు.

విద్యాసాగర్ అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.ఇక ఈ సినిమా కథ, నటన, పాటల పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 100 రోజులు ఆడింది.

ఈ సినిమాను మలయాళ సినిమా నుండి రీమేక్ చేశారు.మలయాళంలో ఈ సినిమా 1993లో 'మణిచిత్రతజు' అనే పేరుతో విడుదలయింది.

ఇందులో మోహన్ లాల్ హీరోగా నటించాడు.ఇక సురేష్ గోపి, శోభన తదితరులు నటించారు.

"""/" / ఈ సినిమాకు ఫాజిల్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా దాదాపు 300 రోజులకు పైగా ఆడి రికార్డ్ బ్రేక్ చేసింది.

అప్పట్లోనే ఈ సినిమా దాదాపు మూడు కోట్ల వసూలు చేయగా.రెండు జాతీయ అవార్డులు కూడా సొంతం చేసుకుంది ఈ సినిమా.

ఆ తర్వాత 2004 లో కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేశారు.'ఆప్తమిత్ర' అనే పేరుతో ఈ సినిమాను విడుదల చేశారు.

"""/" / ఇందులో కన్నడ స్టార్ హీరో విష్ణువర్ధన్, సౌందర్య నటించారు.ఇక ఈ సినిమా మాత్రం ఏడాది వరకు ఆడి ఏకంగా చరిత్రని సృష్టించిందని చెప్పవచ్చు.

ఈ సినిమా రిజల్ట్ చూసేసరికి రజినీకాంత్ మనసు మొత్తం ఈ సినిమాపై పడింది.

దీంతో ఈ సినిమాను రీమేక్ చేయాలని రజనీకాంత్ కోరడంతో 5 నెలలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

"""/" / అలా తెలుగులో చంద్రముఖి గా డబ్బింగ్ తో తెరకెక్కి తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా చెన్నై శాంతి థియేటర్లో 890 రోజులు ఆడింది.ఇక ఈ సినిమాకు కూడా ఎన్నో అవార్డులు అందాయి.

ఇందులో చంద్రముఖి పాత్రలో నటించిన జ్యోతిక మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకుంది.ఇక ఈ సినిమా తర్వాత జ్యోతిక, నయనతార కూడా ఎన్నో అవకాశాలు అందుకొని మంచి సూపర్ సక్సెస్ లు సొంతం చేసుకున్నారు.

బీజేపీపై చార్జ్‎షీట్ విడుదల చేసిన కాంగ్రెస్..!!