యోగా చేసే వారు అస్సలు చేయకూడని తప్పులు ఏంటో తెలుసా?
TeluguStop.com
యోగా.ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఇతర వ్యాయామాలతో పోలిస్తే యోగా వల్లే అత్యధిక ప్రయోజనాలు ఉన్నాయి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
అధిక బరువును తగ్గించడంలోనూ, శరీరాన్నీ.మనసును దృఢంగా మార్చడంలోనూ, ఒత్తిడిని నివారించడంలోనూ, మోకాళ్ల నొప్పులను దూరం చేయడంలోనూ, మెదడు పని తీరును మెరుగు పరచడంలోనూ ఇలా ఎన్నో విధాలుగా యోగా ఉపయోగపడుతుంది.
అందుకే రోజుకు కనీసం ఇరవై నిమిషాలైనా యోగా చేస్తే హెల్తీగా, ఫిట్‌గా ఉండొచ్చని నిపుణులు చెబుతుంటారు.
"""/"/
అయితే యోగా చేసే వారు తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు.
అవేంటి.? అసలు అవి ఎందుకు చేయకూడదు.
? అన్న విషయాలు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా కొందరు అతి ఊత్సాహంతో యోగా స్టార్ట్ చేసిన కొత్తలోనే కఠినమైన ఆసనాలు వేసేసి తెగ కష్టపడతారు.
కానీ, అలా చేయడం వల్ల ఆదిలోనే విసుగు పుట్టేస్తుంది.పైగా కండరాలు కూడా పట్టేస్తాయి.
కాబట్టి, ముందే కఠినమైనవి కాకుండా చిన్న చిన్న ఆసనాలతో ప్రారంభించండి.అలాగే కొందరు ఏ టైమ్‌లో పడితే ఆ టైమ్‌లో యోగా చేస్తారు.
కానీ, వాతావరణం వేడిగా ఉండే సమయంలో యోగా చేస్తే శరీరంలో డీహైడ్రేట్ అయిపోతుంది.
అందుకే వాతావరణం కాస్త చల్లగా ఉన్నప్పుడు యోగా చేయండి.భోజనం చేసిన వెంటనే కూడా యోగా చేయరాదు.
అలా చేస్తూ జీర్ణ వ్యవస్థ పని తీరు నెమ్మదిస్తుంది.దాంతో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను ఎదర్కోవాల్సి వస్తుంది.
కొందరు యోగా చేసేటప్పుడు బాగా టైట్‌గా ఉండే దుస్తులను వేసుకుంటారు.కానీ, అలాంటి దుస్తులను ధరిస్తే ఊపిరితిత్తులపై ప్రభావం పడుతుంది.
కాబట్టి, యోగా చేసే సమయంలో కాస్త వదలుగా ఉండే బట్టలను వేసుకోండి. """/"/
ఇక ఇక కొందరు యోగా చేసిన తర్వాత స్నానం చేస్తారు.
అయితే అలా ఎప్పుడూ చేయరాదు.యోగా చేయడానికి ముందే స్నానం చేయాలి.
అమెరికాలో కేసుపై …అదానీ గ్రూప్ క్లారిటీ