స్త్రీలు ధరించే ఈ నగల అర్థం, పరమార్థం ఏమిటో తెలుసా?
TeluguStop.com
ప్రస్తుతం స్త్రీలు అందంగా కనిపించడానికి వివిధ రకాల నగలను ధరిస్తారు.కానీ ఇప్పటి స్త్రీలను ఈ నగల ప్రాముఖ్యత ఏమిటి అని అడగగా కేవలం అందం కోసం మాత్రమే ఈ నగలను పెట్టుకున్నామని ఎంతో సునాయాసంగా చెబుతారు.
కానీ ఆ నగలు స్త్రీలు ఎందుకు పెట్టుకుంటారో, పెట్టుకోవడం వల్ల ఎలాంటి పరిణామాలు కలుగుతాయో బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు.
అయితే స్త్రీలు ధరించే ఈనగల ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.చంద్రవంక : ఈ నగ స్త్రీలు తల మధ్యభాగంలో ధరించి ఉంటారు.
ఈతల మధ్య భాగం నుంచి మనకు జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మ రంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు.
కాబట్టి ఆ బాగాన ఈ నగతో కప్పి వేస్తారు. """/" /
మెడలో వేసుకొనే హారాలు : వివిధ రకాల నగలను మనం మెడలో దరిస్తాము.
మన మనసులో పరమాత్మడు ఉన్నాడని తెలియజెబుతు ఆ నగలను మెడలో ధరిస్తారు.ఈ విధంగా నగలను ధరించడం ద్వారా మనకు తెలిసి తెలియక చేసిన పాపాలు సైతం తొలగిపోతాయి.
అంతేకాకుండా ఈ బంగారం మన శరీరంపై ఉండటం ద్వారా శరీర వేడిని తగ్గిస్తాయి.
మెడలో ధరించిన నగలు మన ఛాతీ పై పడటం ద్వారా జుట్టుకు సంబంధించినటువంటి వ్యాధులు తొలగిపోతాయి.
ముక్కర : ముక్కుకు ముక్కెర ధరించడం ద్వారా మనం మాట్లాడేటప్పుడు పైపెదవి ఎక్కువ మాట్లాడకుండా ఆపుతుంది.
ముక్కు కొన భాగంలో ముక్కెర ధరించడం ద్వారా మన దృష్టి ఆ ముక్కెర పై పడటం ధ్యానంలో ఒక భాగం.
అంతే కాకుండా మనం ఊపిరిని వదిలేటప్పుడు వచ్చే చెడు గాలిని ముక్కెర శుద్ధ చేస్తుంది.
గాజులు : స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి మన మణికట్టు వద్ద ఉన్న నగరాలలో రాపిడి జరిగి రోజంతా ఎంతో చలాకీగా ఉంటూ పనులను కొనసాగిస్తారు.
అంతేకాకుండా ఈ గాజులను ధరించడం ఐదవ తనంగా కూడా భావిస్తారు.కాలి మెట్టెలు : గర్భకోశంలో ఉన్న నరాలు, కాలి మెట్టెలకు సంబంధం ఉంటుంది.
పెళ్లైన ఆడవారు మెట్టెలు ధరించడం వల్ల ఈ మెట్టెలు నేలకు తాకి వారిలో కొత్త ఉత్తేజాన్ని కలిగిస్తుంది.
ఈ విధంగా స్త్రీలు నగలు ధరించడం ద్వారా మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.
అందుకోసమే పూర్వకాలం రాజులు, చక్రవర్తులు సైతం ఇలాంటి నగలను ధరించే వారు.
ఆ క్యారెక్టర్ చాలా చీప్.. అందులో నటించడమే ఆశ్చర్యం..?