గుడికి వెళ్లడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో తెలుసా?

సాధారణంగా మన ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళాలని చెబుతుంటారు.ఈ క్రమంలోనే మన ఇంట్లో వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటారు.

అదే విధంగా మనల్ని కూడా గుడికి రమ్మని పిలుస్తుంటారు.ఈ క్రమంలోనే చాలామంది గుడిలో ఒక్కడే దేవుడు ఉన్నాడా? మన మనసులో దేవుడిపై నమ్మకం ఉంటే చాలు.

మరీ ప్రత్యేకంగా గుడికి వెళ్లి మొక్కాల్సిన పని లేదు.మనం భక్తితో ఎక్కడ పూజిస్తే అక్కడ దేవుడు ఉంటాడు అని చాలామంది వాదిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే వారు గుడికి వెళ్లడానికి ఇష్టపడరు.అయితే గుడికి వెళ్లడం వల్ల కేవలం దేవుని దర్శనం మాత్రమే జరుగుతుంది అనుకుంటే అది పొరపాటే.

మరి గుడికి వెళ్లడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.

దేవాలయం నిర్మించేటప్పుడు, ఆలయంలోని గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ట చేసేటప్పుడు విగ్రహాల కింద పీట భాగంలో కొన్ని యంత్రాలను స్థాపిస్తారు.

ఈ క్రమంలోనే రోజు భగవంతుడికి వాటికి పూజ చేసే సమయంలో కొంత శక్తిని గ్రహిస్తాయి.

ఆ శక్తి ఆలయ ప్రాంగణం మొత్తం ప్రసరిస్తుంది.అదే విధంగా ఆలయం గర్భగుడి పై భాగంలో ఉన్నటువంటి కలశం అనేక శక్తులను గుడి ప్రాంగణం మొత్తం ప్రసరింపజేస్తుంది.

కనుక ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం వల్ల మనకు తెలియని అద్భుతమైన శక్తి మనలో కలుగుతుంది.

ఇకపోతే గర్భగుడిలో అభయ ముద్రతో భక్తులకు దర్శనం కల్పిస్తున్న స్వామి వారిని చూడగానే మన మనసులో ధైర్యం కలుగుతుంది.

మన జీవితంలో ఏదైనా సమస్యలు ఎదురైతే మనల్ని ఆదుకునే వారు ఉన్నారనే భరోసా కలుగుతుంది.

గుడికి వెళ్ళగానే ఆ ప్రాంగణంలో ఉన్నంతసేపు మనకు మనసు ఎంతో తేలికగా ప్రశాంతంగా ఉంటుంది.

"""/" / ఆలయ ప్రాంగణంలో గుడి గోపురం పై ఉన్న కలశం ద్వారా గుడి ప్రాంగణం మొత్తం విశిష్ట శక్తులు ప్రచురించబడి ఉంటాయి.

ఈ విధంగా దైవశక్తితో పాటు వివిధ రకాల శక్తులు ప్రభావం అక్కడికి వెళ్లిన వారిపై ఉండటంవల్ల వారిలో పాపాలు, దోషాలు కూడా తొలగిపోతాయి.

ఇక మన ప్రాంతంలో ఉన్న ఆలయాలను మాత్రమే కాకుండా ఏదైనా కొత్త ప్రాంతంలో ఉన్న ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆలయ చరిత్ర, ఆలయ నిర్మాణం, ఆలయ పురాణ కథలు తెలుసుకోవడానికి వీలుంటుంది.

ఈ విధంగా ఆలయాలకు వెళ్ళినప్పుడు కేవలం దైవ దర్శనం మాత్రమే కాకుండా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు.

అక్కవరంలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ