తులసి చెట్టు విత్తనాల వలన ఎన్ని ఉపయోగాలో తెలుసా..?!
TeluguStop.com

హిందూ సంప్రదాయం ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తారు.తులసి మొక్కకు పూజలు చేసి మరీ ప్రదక్షణలు చేసి దండం పెడతారు.


అలాగే తులసి మొక్కలో ఎన్నో రకాల అయిన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.


తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.కేవలం తులసి ఆకులు మాత్రమే కాకుండా తులసి చెట్టు విత్తనాల వలన ఎన్నో రకాలయిన ఉపయోగాలు ఉన్నాయని మీకు తెలుసా.
? మరి తులసి మొక్క విత్తనాల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందామా.
తులసి గింజలు ఆరోగ్యానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి.ముఖ్యంగా ఈ తులసి గింజలు ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది.
ఎందుకంటే తులసి విత్తనాల్లో ఫ్లేవనాయిడ్స్, ఫినాలిక్ వంటి ఇమ్యూనిటీని పెంచే పోషకాలు ఉన్నాయి.
ఫలితంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాలు చాలా తక్కువగా ఉంటాయి.అలాగే తులసి సీడ్స్ లో ఎక్కువ మోతాదులో ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
తులసి గింజలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన కడుపుకు సంబందించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.
జీర్ణక్రియ అనేది చురుకుగా, సక్రమంగా జరుగుతుంది.ఫలితంగా మలబద్ధకం, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువమంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
అలాంటి వారు తులసి గింజలను క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే బరువు తగ్గుతారు.
ఈ విత్తనాల్లో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉండడంతో పాటు అధికంగా ఫైబర్ ఉంటుంది.
తులసి విత్తనాల్లో యాంటీ ఇన్ల్ఫమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి.అందుకే ఇవి శరీరంలో ఉన్న వాపును తొలగించడంలో సహాయపడతాయి.
తులసి విత్తనాల వలన మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.అలాగే తులసి విత్తనాల వినియోగం వలన శారీర అలసట తగ్గడంతో పాటు మనసు ప్రశాంతంగా ఉంటుంది.
చూసారు కదా తులసి విత్తనాల వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.మరి మీరు కూడా తులసి విత్తనాలను మీ ఆహారంలో భాగంగా చేసుకుని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
దుబాయ్ వెళ్లేందుకు రూల్స్ మరీ ఇంత కఠినమా.. చిన్నారికి నో ఎంట్రీ.. ఎయిర్‌పోర్ట్‌లో రచ్చ!