కాశీ సంకట మోచన్ మందిరం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
TeluguStop.com
శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి నిరంతరం రామనామ స్మరణలో ఉంటాడు.కేసరి.
అంజనా దేవిల పుత్రుడైన హనుమాన్ సీతాదేవి అన్వేషణలో లంకకు వెళ్లి ఆమె ఆచూకీ కనుగొంటాడు.
అనంతరం శ్రీరాముడు వానరుల సాయంతో రావణాసురుడిని వధించడంతో సీతమ్మకు చెర వీడుతుంది.హనుమాన్ చిరంజీవి.
ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ప్రత్యక్షం అవుతాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.భారత దేశంలో వేలాది హనుమాన్ మందిరాలు ఉన్నాయి.
వీటిలో వారణాసిలోని సంకట్ మోచన్ మందిరం ప్రముఖ దేవాలయంగా ఖ్యాతి గడించింది.h3 Class=subheader-styleహనుమాన్ ప్రత్యక్షమైన ప్రదేశంలో.
/h3p
రామ చంద్రుని చరితాన్ని రాసిన కవుల్లో తులసీదాస్ అగ్రగణ్యులు.ఆయన రాసిన రామచరిత మానస్ మహాగ్రంథం.
వారణాసిలోని అస్సి నదీ తీరంలో తులసీదాసు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనట్టు స్థల పురాణం వెల్లడిస్తోంది.
అంజనీ పుత్రుడి ఆశీస్సులతోనే ఈ పుస్తకాన్ని రచించినట్టు చరిత్ర కారులు పేర్కొంటారు.శని ప్రభావం నుంచి రామ భక్తులను హనుమాన్ రక్షిస్తాడని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
రామ భక్తుడైన స్వామిని పూజిస్తే అన్ని శుభాలు చేకూరుతాయి అని అనంతకోటి భక్తుల ప్రగాఢ విశ్వాసం.
వారణాసిలో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని నూతన విశ్వనాధుని మందిర సమీపంలో హనుమాన్ ఆలయం ఉండటం విశేషం.
సంకటం అంటే కష్టాలు.మోచనకు అర్ధం విముక్తి కలిగించడం.
కష్టాల నుంచి విముక్తి కలిగిస్తాడు కనుకే ఆంజనేయ స్వామిని సంకట్ మోచన్ హనుమాన్ గా కొలుస్తారు.
మంగళ, శనివారాల్లో భక్తులు వేలాదిగా ఆలయానికి తరలి వస్తారు.
కూతురిని ఎప్పుడు చూపిస్తావ్ చరణ్.. మెగా ఫ్యాన్స్ ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా?