కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలో ఎంతో పవిత్రమైన నెలలో కార్తీకమాసం ఒకటని చెబుతారు.

కార్తీక మాసం ఇది పరమ పవిత్రమైన మాసంగా భావించడమే కాకుండా ఈ నెల మొత్తం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో శివకేశవులకు పూజలు చేస్తారు.

ఎలాంటి మాంసాహారాలు ముట్టుకోకుండా నెల మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఆ శివకేశవులని ఆరాధిస్తూ దీపం వెలిగించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

ఈ క్రమంలోనే ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు.

ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీ విష్ణు దేవుడిగా భావించి ఈ నెల మొత్తం పూజలు చేస్తారు.

అదేవిధంగా కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.అసలు కార్తీకమాసానికి ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడానికి సంబంధం ఏమిటి అనే విషయానికి వస్తే.

పూర్వకాలం నుంచి మొక్కలను ఎంతో పవిత్రమైన, ఔషధ గుణాలు కలిగిన మొక్కలుగా భావిస్తారు.

ఈక్రమంలోనే ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయన్న సంగతి మనకు తెలిసిందే.

కార్తీక మాసం చలికాలంలో రావడం వల్ల ఈ కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కనుక వాటి అన్నింటికి దూరం చేయడానికి అప్పట్లో పెద్ద వారు కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని సాంప్రదాయాన్ని పెట్టారు.

అదే సంప్రదాయాన్ని ఇప్పటికీ ఆచరిస్తూ వస్తున్నారు.అయితే కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనాలు చేసే ముందు ఉసిరి చెట్టు కింద విష్ణుదేవుడి ఫోటో వచ్చి పూజ చేసిన అనంతరం భోజనాలు చేయాలి.

"""/"/ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టుని దాత్రి వృక్షం అంటారు కనుక కార్తీక భోజనాలు ధాత్రి భోజనాలు అని కూడా పిలుస్తారు.

ఉసిరి చెట్టు నీడలో అరటి ఆకులో లేదా పనస ఆకులో భోజనం చేయడం ఎంతో మంచిదని పండితులు తెలియజేస్తున్నారు.

పురాణాల ప్రకారం శ్రీ కృష్ణుడు తన సోదరుడు బలరాముడు అలాగేతోటి బాలికలతో కలిసి కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనాలు చేశారని భగవద్గీత తెలియజేస్తోంది.

ఉసిరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఫలం కనుక ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద భోజనం చేయడం వల్ల సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుందని అన్ని శుభఫలితాలు కలుగుతాయని భావిస్తారు కనుక కార్తీకమాసంలో ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగించి అనంతరం భోజనాలు చేస్తూ ఆ రోజు మొత్తం ఎంతో సంతోషంగా గడుపుతారు.

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ను సినిమాలను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా..?