తారకరత్న కుటుంబానికి ఎన్టీఆర్ చేసిన సాయం తెలుసా.. మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.

కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలను నెలకొన్నాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అనే అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఆ సంగతి అటువంటి ఈ సినిమాతో పాటు జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

"""/" / ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న సినిమాలు కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేమిటంటే.దివంగత హీరో నందమూరి తారకరత్న( Nandamuri Tarakaratna ) గురించి మనందరికీ తెలిసిందే.

ఒకప్పుడు వరుసగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తారకరత్న ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక ఇటీవలే మళ్లీ సినిమాలలోకి రాజకీయాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో ఊహించని విధంగా ఆయన 23 రోజులపాటు మృత్యువుతో పోరాడి మరణించిన విషయం తెలిసిందే.

"""/" / అయితే తారకరత్న అలేఖ్య ( Tarakaratna Alekhya )అనే ఆమెను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

అలేఖ్యను పెళ్లి చేసుకునే నాటికి ఆమెకు అప్పటికే పెళ్లి అయి విడాకులు కూడా అయ్యాయి.

ఈ విషయం నందమూరి ఫ్యామిలీకి నచ్చలేదు.నందమూరి ఫ్యామిలీ వీరీ పెళ్లికి నిరాకరించడంతో తారకరత్న ఫ్యామిలీకి దూరంగా వెళ్లి అలేఖ్య జీవిస్తున్న తరుణంలో దారుణంగా ఆర్థిక సమస్యలు ఎదురయ్యే చివరికి తాను ఎంతగానో ఇష్టపడి కొనుక్కున్న కారు ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితికి వచ్చారట.

చివరికి కారు ఎమ్ఐ కట్టకపోవడంతో ఆ కారుని షోరూం వాళ్ళు తీసుకెళ్లారట.ఇక ఆ మరుసటి రోజు ఉదయమే మళ్లీ తారకరత్న ఇంటి ఎదురుగా ఆ కారు ఉందట.

అయితే ఆ కారు అక్కడికి రావడానికి గల కారణం జూనియర్ ఎన్టీఆర్.అసలు విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఆ కారు ఈఎంఐ లు అనే పూర్తి చేసి మళ్లీ ఆ కారును ఇంటికి పంపించారట.

ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!