వేస‌విలో ఈ ప‌ప్పును తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

మే నెల రానే వ‌చ్చింది.మే నెల అంటేనే ఎండ‌లు ఏ స్థాయిలో ఉంట‌యో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అయితే ఈ సారి ఊహించిన దానికంటే ఎక్కువ‌గానే ఎండ‌లు భ‌య‌పెడుతున్నాయి.అధిక ఎండ‌లు, విప‌రీత‌మైన వేడి, ఉక్క‌పోత కార‌ణంగా ప్ర‌జ‌లు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాయి.

ఈ స‌మ్మ‌ర్‌లో ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవాలంటే ఖ‌చ్చితంగా కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

అటువంటి ఆహారాల్లో పెస‌ర‌పప్పు ఒక‌టి.ఇది తినేందుకు రుచిగా ఉండ‌టంతో పాటు ప్రోటీన్‌, కాల్షియం, మెగ్నీషియం, కాప‌ల్‌, ఐర‌న్‌, థయామిన్, ఫైబ‌ర్‌, రిబోఫ్లావిన్, విట‌మిన్ సి, విట‌మిన్ కె వంటి పోష‌కాలెన్నో క‌లిగి ఉంటుంది.

అందుకే పెస‌ర‌ప‌ప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా వేస‌వి కాలంలో పెస‌ర‌ప‌ప్పును క‌నీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి.

మిగిలిన సీజ‌న్ల‌తో పోలిస్తే వేస‌విలో గుండె జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం కాస్త అధికంగా ఉంటుంది.

అయితే పెస‌ర‌ప‌ప్పు గుండె జ‌బ్బుల‌కు అడ్డు క‌ట్ట వేయ‌డంలో గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ఈ ప‌ప్పును డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ క‌రిగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

దాంతో గుండె ఆరోగ్యంగా మారుతుంది. """/"/ అలాగే పెస‌ర‌ప‌ప్పును తీసుకోవ‌డం వ‌ల్ల అధిక వేడి తొల‌గిపోయి శ‌రీరం చ‌ల్ల‌గా మారుతుంది.

నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నించే వారికీ పెస‌ర‌ప‌ప్పు బెస్ట్‌ ఫుడ్‌గా చెప్పుకోవ‌చ్చు.

వారంలో రెండు నుంచి మూడు సార్లు పెస‌ర‌ప‌ప్పును తీసుకుంటే సూప‌ర్ పాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు.

మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తులు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను అదుపు చేసుకోవ‌డం కోసం నానా తిప్ప‌లు ప‌డుతుంటారు.

అయితే అందుకు పెస‌ర‌ప‌ప్పు గ్రేట్‌గా హెల్ప్ చేస్తుంది.దీనిని ఆహారంలో భాగం చేసుకుంటే ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.శ‌రీరారినికి కావాల్సిన ప్రోటీన్ ల‌భిస్తుంది.

మ‌రియు రోగ నిరోధ‌క‌ వ్య‌వ‌స్థ సైతం బ‌ల‌ప‌డుతుంది.

అభివృద్ధికి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ..: మోదీ