ఖాళీ కడుపుతో ఒక చెంచా నెయ్యి తీసుకుంటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?
TeluguStop.com
నెయ్యి.( Ghee ) పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది ఇష్టంగా తినే డైరీ ప్రొడక్ట్స్ లో ఒకటి.
భారతీయ వంటకాలు మరియు ఆయుర్వేద వైద్యంలో నెయ్యి ప్రధానమైనది.నెయ్యిలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్ తో పాటుగా కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ కూడా ఉంటాయి.
తగిన మొత్తంలో నెయ్యిని తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలను పొందవచ్చు.అయితే నెయ్యి తీసుకునే సమయాన్ని బట్టి కూడా దాని ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి.
ముఖ్యంగా ఉదయం ఖాళీ కడుపుతో( Empty Stomach ) ఒక చెంచా నెయ్యి తీసుకోవడం వల్ల కొన్ని అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు.
ప్రధానంగా బరువు తగ్గాలి( Weight Loss ) అనుకుంటున్నవారు ఉదయాన్నే కాళీ కడుపుతో ఒక స్పూన్ నెయ్యిని నేరుగా తీసుకోండి.
ఇలా చేయడం వల్ల ఎక్కువ సమయం పాటు ఆకలి వేయకుండా ఉంటుంది.అతి ఆకలి సమస్య దూరం అవుతుంది.
దాంతో తినడం తగ్గిస్తారు.అలాగే పరగడుపున ఒక చెంచా నెయ్యిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ( Digestive System ) బలోపేతం అవుతుంది.
చిన్న పేగులకు సంగ్రహించే శక్తి పెరుగుతుంది.మలబద్ధకం సమస్య ఉంటే దూరం అవుతుంది.
పేగులు శుభ్రంగా మారతాయి. """/" /
ఉదయం ఖాళీ కడుపుతో నెయ్యిని తీసుకుంటే డే మొత్తం యాక్టివ్‌గా, ఎనర్జిటిక్ గా ఉంటారు.
నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలగే నెయ్యి మెదడు మరియు నాడీ వ్యవస్థను బలపరుస్తుంది.
దీర్ఘాయువును ప్రోత్సహిస్తుంది.వివిధ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
విటమిన్ ఎ, విటమిన్ ఇ వంటి పోషకాలకు నెయ్యి గొప్ప మూలం.పరగడుపున ఒక చెంచా నెయ్యి తీసుకోవడం వల్ల అందులో ఉండే పోషకాలు ఆరోగ్యకరమైన కాలేయం, సమతుల్య హార్మోన్లు మరియు సంతానోత్పత్తికి మద్దతు ఇస్తుంది.
"""/" /
అంతేకాదండోయ్.దంత క్షయంతో బాధపడేవారికి నెయ్యి చాలా మేలు చేస్తుంది.
నెయ్యిలో పుష్కలంగా ఉండే విటమిన్ కె మన శరీరంలో కాల్షియం శోషణకు ఉపయోగపడుతుంది.
ఇది దంత క్షయం నివారణలో సహాయపడుతుంది.నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్‌లతో కూడిన నెయ్యి ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి కూడా హెల్ప్ చేస్తుంది.
ఎన్టీఆర్ నెల్సన్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వైరల్.. నందమూరి ఫ్యాన్స్ కు పండగే!