గోంగూర ఆకుల వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?
TeluguStop.com
గోంగూరని(Gongura Leaves ) రకరకాల ప్రాంతాలను బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు.
అయితే కొన్ని ప్రదేశాలలో గోంగూర అని పిలుస్తారు.అయితే దీనిని ఎలాంటి పేర్లతో పిలిచినా కూడా ఇది ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది.
మనిషికి అవసరమైన ఆరోగ్యకరమైన విటమిన్స్, పోషకాలు ఇందులో ఉన్నాయి.ముఖ్యంగా గోంగూరలో విటమిన్స్ ఏ, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ సి, విటమిన్ బి9, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, కెరోటిన్ లాంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
ఇక గోంగూరను వారానికి రెండుసార్లు తినడం వలన కాలేయ ఆరోగ్యం బాగుంటుంది.అలాగే లివర్ టాక్సిన్స్, కొలెస్ట్రాల్( Cholesterol ) లాంటివి కూడా తగ్గిపోతాయి.
"""/" / గోంగూర ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగడం వలన శరీరంలో పేర్కొన్న కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది.
ఇక అధిక బీపీ( High Blood Pressure )తో బాధపడుతున్న వారు కూడా గోంగూరని తీసుకోవడం వలన బీపీ కంట్రోల్ లో ఉంటుంది.
ఇక గోంగూరలో అధిక పొటాషియం, మెగ్నీషియం ఉంటుంది.ఇది రక్తపోటును తగ్గిస్తాయి.
ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే గోంగూర కచ్చితంగా తినాలి.ఎందుకంటే ఇందులో ఉండే మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎముకల బలానికి తోడ్పడుతాయి.
"""/" /
అలాగే దంతాల నొప్పి, రక్తస్రావం, దుర్వాసన లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది.
మరి ముఖ్యంగా క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారించి సమర్థవంతంగా పనిచేస్తుంది.ఇక రక్తహీనతను దూరం చేసి ఐరన్ లోపాన్ని కూడా ఇది సరిదిద్దుతుంది.
ఇక ముఖ్యంగా జుట్టు సంరక్షణలో కూడా గోంగూర కీలక పాత్ర పోషిస్తుంది.ఇందులో ఉండే సోడియం, క్లోరోఫిల్స్, ఫాస్ఫరస్, ఐరన్ ఎర్రరక్త కణాలు ఉత్పత్తిని పెంచుతాయి.
అందుకే గోంగూరను వారానికి రెండుసార్లు ఆహారంలో చేర్చుకున్నట్లైతే ఈ ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటిని కూడా పొందవచ్చు.
అద్దె విషయంలో వివాదం.. ఎన్ఆర్ఐ మహిళని సజీవదహనం చేసిన బాలుడు