Ginger : రోజు ఉదయం చిన్న అల్లం ముక్కను నమిలి తింటే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?
TeluguStop.com
దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో అల్లం ను తరచుగా వాడుతూనే ఉంటారు.ముఖ్యంగా రోజువారి కూరల్లో అల్లం ను వినియోగించే వారు ఎందరో ఉన్నారు.
అల్లం ఆహారానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.అయితే అల్లం కేవలం మంటలకు వాడే మసాలా మాత్రమే కాదు.
మీ ఆరోగ్యానికి అద్భుతాలు చేయగల శక్తివంతమైన హెర్బ్.అల్లం లో అనేక పోషకాలు మరియు ఔషధ గుణాలు నిండి ఉంటాయి.
అందువల్ల ఆరోగ్యపరంగా అల్లం బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తుంది.ముఖ్యంగా రోజు ఉదయం చిన్న అల్లం ముక్క( Ginger )ను నమిలి తినడం వల్ల అంతులేని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.
"""/" /
అల్లంలో జింజెరాల్ మరియు షోగోల్ అనే సమ్మేళనాలు ఉన్నాయి.ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీఆక్సిడెంట్స్ ను అందిస్తాయి.
రోజు ఉదయం చిన్న అల్లం ముక్క తింటే వికారం, వాంతులు సమస్య ఉండదు.
మార్నింగ్ సిక్ నెస్ దూరం అవుతుంది.అలాగే అల్లం లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతాయి.
అదే సమయంలో కండరాల నొప్పి( Muscle Pain )ని తగ్గించడంలో మరియు ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడతాయి.
"""/" /
చాలా మంది బ్యాడ్ ప్రీత్ సమస్యతో బాధపడుతుంటారు.అలాంటి వారు ఉదయం అల్లం ముక్క నమిలి తినడం వల్ల నోటిలో బ్యాక్టీరియా నాశనం అవుతుంది.
నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.అంతేకాదు ప్రతిరోజు ఉదయం చిన్న అల్లం ముక్కను నమిలి తింటే శరీరంలో పేరుకుపోయిన మలినాలు సులభంగా బయటకు తొలగిపోతాయి.
శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.వెయిట్ లాస్ అవుతారు.
కీళ్ల నొప్పులు, వాపులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు ఉదయం అల్లం ముక్కను తీసుకుంటే ఆయా సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు.
ఇక ఉదయం అల్లం ముక్కను తింటే గ్యాస్, ఎసిడిటీ( Acidity ), మలబద్ధకం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు సైతం ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
చిరు నాగ్ వెంకీలలో బాలయ్యకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా?