ఖర్జూరం తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ఆరోగ్యంగా ఉండాలి అంటే రోజుకి ఒక ఆపిల్ అయినా తినాలి అని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు.

అదేవిధంగా రోజుకి ఒక ఐదు, ఆరు ఖర్జూరం( Dates ) తింటే కూడా ఇక డాక్టర్ల అవసరం అస్సలు ఉండదు.

ఎందుకంటే ఖర్జూరంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి.మరీ ముఖ్యంగా రక్తహీనత, ఐరన్ సమస్య ఉన్నవారికి ఖర్జూరం చాలా సహాయపడుతుంది.

ఇక ఎప్పుడూ కూడా నీరసంగా కనిపించేవారు, బలహీనంగా ఉన్నవారు ఖర్జూరం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఇంకా ప్రతిరోజు ఖర్జూరం తినే అలవాటు ఉంటే అది కచ్చితంగా మంచి అలవాటే.

"""/" / ఎందుకంటే ఖర్జూరంలో చాలా పోషకాలు ఉన్నాయి.అందుకే వీటిని ప్రతిరోజు తీసుకోవడం వలన మన శరీరానికి పూర్తి శక్తి అందుతుంది.

రోజంతా ఉత్సాహంగా ఉంటారు.ఇక ఎదిగే పిల్లలకు ఖర్జూరం పెడితే చక్కగా ఎదుగుతారు.

ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు పిల్లలు ఎదుగుదలకి బాగా ఉపయోగపడుతుంది.అలాగే ఖర్జూరం తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

స్త్రీ, పురుషులు ఇద్దరు కూడా ఖర్జూరం తీసుకోవడం చాలా ఉత్తమం. """/" / ఎందుకంటే చాలామంది స్త్రీలలో రుతుక్రమం ఆగిపోవడం ఇలాంటివి జరుగుతుంది.

అలాంటి వారు ఖర్జూరం తీసుకుంటే ఈ సమస్య తగ్గిపోతుంది.ఇక పురుషుల్లో అయితే టెస్టోర్స్ ఉత్పత్తి తగ్గిపోవడం, అలాగే ఎముకల్లో క్యాల్షియం, ఫాస్ఫరస్ తగ్గిపోవడం, ఎముకలు గుల్లగా తయారవ్వడం, కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు లాంటివి వస్తూ ఉంటాయి.

అలాంటివారు ఖర్జూరం తీసుకుంటే అందులో ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్ వల్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి( Back Pain ), మెడ నొప్పి ఇక ఎన్నో విధాలైనా కీళ్లకు సంబంధించిన నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి.

"""/" / ఇక చాలామందిలో కాళ్లు చేతులు తిమ్మిర్లు, కాళ్లు చేతులు వంకర్లు పోవడం ఉంటాయి.

దీన్ని కాల్షియం లోపం అని అంటారు.అయితే తరచుగా ఖర్జూరం తీసుకుంటే ఈ సమస్య కూడా తగ్గుతుంది.

ఇక నీటిలో నానబెట్టిన తర్వాతే ఖర్జూరాన్ని తినాలి.ఇలా ఖర్జూరాన్ని తరచూ తీసుకుంటే మన శరీరంలో ఎలాంటి సమస్య కూడా ఉండదు.

పుట్టినరోజు వేల గొప్ప మనసు చాటుకున్న సితార.. తండ్రికి తగ్గ తనయ?