ఈ ఏడాది వినాయక చవితి శుభ ముహూర్తం ఎప్పుడంటే?

హిందూ ప్రజలు ఎన్నో పండుగలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.ఈ క్రమంలోనే అన్ని పండుగలతో పాటు వినాయక చవితి పండుగను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్ల పక్ష చతుర్దశి రోజు వస్తుంది.

ఈ రోజున వినాయకుడు విఘ్నేశ్వరుడిగా ఆధిపత్యం పొందటం వల్ల మన జీవితంలో ఎలాంటి విఘ్నాలు లేకుండా కాపాడమని భక్తులు పెద్ద ఎత్తున స్వామివారికి పూజలు చేస్తారు.

వినాయక చవితి రోజు భక్తులు విగ్రహాలను ప్రతిష్టించి ఎంతో అంగరంగ వైభవంగా పూజలను నిర్వహిస్తారు.

అయితే ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు వచ్చింది వినాయకుడికి పూజ చేయడానికి ఏ సమయం అనువైనది అనే విషయాల గురించి తెలుసుకుందాం.

ఈ ఏడాది వినాయక చవితి పండుగ సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం వచ్చింది.

ఈ రోజు స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి స్వామి వారి కథ చదువుతో ఈ పండుగను జరుపుకుంటారు.

ఎంతో పవిత్రమైన చతుర్దశి రోజు శుభ తిథి 12:18 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 9:57 నిమిషాల వరకు శుభతిథి ఉంటుంది.

ఈ కాలంలో వినాయకుడికి పూజ చేయడానికి సుముహూర్తం ఉదయం 11:30 నిమిషాల నుంచి 1:33 వరకు వినాయకుడిని పూజించడానికి ఎంతో విశిష్టమైన సమయం అని చెప్పవచ్చు.

"""/" / హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద శుక్ల చతుర్దశి రోజు వినాయకుడు జన్మించిన దినమని కొందరు భావించగా మరికొందరు వినాయకుడికి ఈరోజు విఘ్నేశ్వరుడిగా ఆధిపత్యం ఇచ్చారని స్వామివారి ఆశీస్సులు పొందడం కోసం పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు.

ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ వారి ఇంటిలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు స్వామివారికి సమర్పించి పూజ చేస్తారు.

ఇలా చేయడం వల్ల మన జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

భారతీయుడు 3 సినిమాలో ఆ ఒక్కటి హైలెట్ గా నిలువబోతుందా..?