ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ ఏదో మీకు తెలుసా..?
TeluguStop.com
వ్యాక్సిన్ అనే మాట ఇప్పుడు ఎంత పాపులర్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నిజానికి కరోనా రాకముందు అసలు వ్యాక్సిన్ అంటే చాలామందికి పెద్దగా తెలియదు.కానీ ఇప్పుడు అలాకాదు.
వ్యాక్సిన్ అనే మాట చిన్న పిల్లాడి దగ్గరి నుంచి పండు ముసలి వారి దాకా అందరికీ తెలిసిపోతోంది.
ఎందుకంటే కరోనా సృష్టించిన కల్లోలం అంతలా ఉంది మరి.ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ మహమ్మారి పేరు చెబితేనే అందరూ వణికిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పటికే దీని భారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.అయితే ఇలాంటి పెద్దరోగాలు ప్రపంచానికి కొత్తేమీ కాదు.
ఇప్పటి తరానికి మాత్రమే ఇది కొత్త.ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో పెద్ద రోగాలు వచ్చి ప్రాణాలను తీశాయి.
అలాంటి క్లిష్ట సమయంలో కూడా వ్యాక్సిన్లు ఎన్నో వచ్చాయి.నిజానికి ఇలాంటి పెద్ద రోగాలకు వ్యాక్సిన్లు తీసుకురావాలంటే ఏండ్ల సమయం పడుతుందని అందరికీ తెలిసిందే.
కానీ కరోనా విషయంలో మాత్రం కొంచెం స్పీడుగానే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.మరి ఇలాంటి మహమ్మారులకు అన్నింటికీ అయితే వ్యాక్సిన్ రాలేదు.
కేవలం కొన్నింటికి మాత్రమే వచ్చాయి. """/"/
మరి ప్రపంచంలో మొదటిసారి రెడీ అయిన వ్యాక్సిన్ ఏంటనే దానిపై ఇప్పుడు చర్చ సాగుతున్న విషయం తెలిసిందే.
కాగా మశూచీ వ్యాక్సిన్ మాత్రమే ప్రపంచంలో మొదటిసారి అందుబాటులోకి వచ్చింది.3వేల సంవత్సారాల నుంచే ఈ వ్యాధి ఇబ్బందులు పెడుతోంది.
కాగా దీనికి 1796లోనే వ్యాక్సిన్ తీసుకొచ్చారు.అప్పట్లోనే ప్రముఖ వైద్యశాస్త్రవేత్త అయిన ఎడ్వర్డ్ జన్నర్ ఈ వ్యాధికి వ్యాక్సిన్ కనిపెట్టారు.
ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ వ్యాధి క్రమంగా అంతరించిపోయిందనే చెప్పాలి.ఇండియాలోకి 1805లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు.
మొదట్లో మన దేశంలో దీన్ని వ్యతిరేకించినా అవగామన కల్పించడంతో అందరూ దీన్ని వేసుకున్నారు.
బౌండరీలతో రెచ్చిపోయిన సమీర్ రిజ్వీ.. ప్రపంచ రికార్డుల మోత