హరీష్ శంకర్ చేయాలనుకున్న మొదటి సినిమా ఏంటో తెలుసా..?
TeluguStop.com
హరీష్ శంకర్( Harish Shankar ) రైటర్ గా తన కెరీయర్ ను ప్రారంభించిన సమయంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) తనని డైరెక్షన్ చేయమని సలహా ఇచ్చారట.
ఇంకా దానికి తగ్గట్టుగానే ఆయన దగ్గర ఉన్న ఒక కథను చెప్పి హరీష్ తో డైరెక్షన్ చేయించాడు.
ఇక దానికి ఆర్జీవి ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం.ఆ సినిమా ఏంటి అంటే రవితేజ, జ్యోతిక హీరో హీరోయిన్లుగా వచ్చిన షాక్ సినిమా.
( Shock Movie ) ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తుందని అందరూ అనుకున్నారు.
"""/" /
కానీ అందరికీ షాక్ ఇస్తూ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది.
నిజానికి హరీష్ శంకర్ మొదట ఈ సినిమా కాకుండా ఒక ఎంటర్ టైనర్ ని తీద్దామని అనుకున్నడట కానీ రాంగోపాల్ వర్మ చెప్పేసరికి తను ఈ సబ్జెక్ట్ ని ఎంచుకొని సినిమా చేసినట్టుగా తెలియజేశాడు.
ఇక మొత్తానికైతే ఈ సినిమా వల్ల ఆయన భారీ గా నష్టపోయాడనే చెప్పాలి.
ఇక దీని తర్వాత మళ్లీ పూరి జగన్నాధ్ దగ్గర చిరుత, బుజ్జిగాడు లాంటి సినిమాలకు కో డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత మిరపకాయ్( Mirapakay Movie ) సినిమాతో డైరెక్టర్ గా మారాడు.
"""/" /
ఇక అప్పటినుంచి పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్( Gabbar Singh ) లాంటి సూపర్ డూపర్ సక్సెస్ ను తీసి ఇండస్ట్రి హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు.
ఇక ఆర్జీవీ వల్ల హరీష్ శంకర్ దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఖాళీగా ఉంటూ అక్కడ ఇక్కడ పనిచేయాల్సి వచ్చింది.
ఇక నిజానికి మొదటి సినిమాతో సూపర్ హిట్ కొట్టినట్లు అయితే అప్పుడే హరీష్ శంకర్ డైరెక్టర్ గా గుర్తింపు పొందేవాడు.
కానీ అలా చేయలేకపోవడం వల్లే తను ఇండస్ట్రీలో మొదటి సినిమాతో ఫెయిల్యూర్ అయిన డైరెక్టర్ గా మిగిలిపోయాడు.