రుద్రాక్ష పూసల వల్ల ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా..?
TeluguStop.com
ముఖ్యంగా చెప్పాలంటే రుద్రాక్ష పూసలను ( Rudraksha Beads )లెక్కించడం హిందూ మంత్రం యొక్క రూపం అని పండితులు చెబుతున్నారు.
ముఖ్యంగా సాధువులు మరియు మాత విశ్వాసులు కూడా ఈ రుద్రాక్ష పూసలను పట్టుకుని జపించడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాము.
చాలామంది ఆధ్యాత్మిక వ్యక్తులు తమ శరీరానికి చీరలు, నెక్లెస్‌లు లేదా కంకణాల రూపంలో రుద్రాక్ష పూసలను ధరిస్తారు.
మన ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతాయని చాలా మందికి తెలియదు.అందుకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేద పండితుల ప్రకారం రుద్రాక్ష పూజలను ధరించడం ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని పండితులు చెబుతున్నారు.
"""/" /
మిమ్మల్ని చుట్టుముట్టే ఎలాంటి ప్రతికూలతనైనా తిప్పుకొట్టడంలో పూసలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
శివునికి ( Lord Shiva )సంబంధించిన ప్రతిదీ ఆధ్యాత్మికతకు పర్యాయపదాలు అని కచ్చితంగా చెప్పవచ్చు.
ఇది రుద్రాక్షకి కూడా వర్తిస్తుంది.రుద్రాక్ష పూసలు ప్రశాంతంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రాచీన హిందూ గ్రంధాలలో( Hindu Scriptures ) ఉంది.
ఇది మీ ఆందోళన స్థాయిని తగ్గించడానికి మరియు ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
మీరు ముఖ్యమైన విషయాలు దృష్టి పెట్టడానికి నిరంతరం కష్టపడే వారైతే మీకు ఏకాగ్రతను పెంచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
రుద్రాక్ష పూసలు లెక్కించేటప్పుడు మంత్రాన్ని పాటించడం వల్ల ఏకాగ్రత కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
"""/" /
అలాగే రుద్రాక్ష పూసలు మీ జీవితంలోకి తెచ్చే ప్రతి మంచి అంశం మీ జీవితాన్ని మరింత సానుకూల మార్గంలో నడిపిస్తుంది.
ఇలా చేయడం వల్ల మీరు శాంతితో జీవితం పై మరింత సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు.
ఒక రుద్రాక్ష మిమ్మల్ని ఇంత మారుస్తుంది అంటే కచ్చితంగా ఆశ్చర్య పోవాల్సిందే.వేదాల్లో రుద్రాక్షకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఇది మిమ్మల్ని పాజిటివ్ గా ఆలోచించేలా చేస్తుంది.ప్రస్తుతం మార్కెట్లో దొరికే రుద్రాక్షలు అన్నీ నకిలీవే అని నిపుణులు చెబుతున్నారు.
అసలైన రుద్రాక్షలను పొందడం ఎంతో కష్టమని కూడా చెబుతున్నారు.
రూపాయి విలువ పతనం … ఎన్ఆర్ఐలకు అవకాశాలతో పాటు ప్రమాదాలు