ఏ నక్షత్రంలో పుష్పవతి అయితే ఏం లభిస్తుందో తెలుసా?
TeluguStop.com

ప్రతీ ఆడపిల్ల వయసు రాగానే పుష్పవతి అవడం సాధారణమైన విషయం.అయితే మన సంప్రదాయాల ప్రకారం అమ్మాయి పుష్పవతి అయినట్లు తెలియగానే.


ఏ నక్షత్రంలో పుష్పవతి అయిందో తెలుసుకుంటారు.ఆయా నక్షత్రాలను బట్టి భవిష్యత్తులో జరగబోయే మంచీ, చెడులను జ్యోతిష్య శాస్త్రాల ద్వారా తెలుసుకుంటారు.


అయితే నక్షత్రం మంచిది అయితే ఆనందంగా ఫంక్షన్ చేసుకుంటారు.ఒకవేళ మంచిరోజు కాకపోయినా, అశుభమైనా.
వేద పండితుల సూచనల మేరకు శాంతి హోమాలు, కర్మలు, పూజలు చేయిస్తే సరిపోతుంది కాబట్టి.
అశ్వినీ నక్షత్రంలో అయితే అపారమైన దుఃఖాలు కల్గుతాయి.భరణీ నక్షత్రంలో అయితే సంతానమంతా ఆడ పిల్లలే.
కృత్తిక నక్ష్తత్రంలో అయితే మహా దరిద్రం.రోహిణి నక్షత్రంలో అయితే చక్కటి దాంపత్యం.
మృగశిర నక్షత్రంలో అయితే అన్యోన్యమైన సుఖ సంసారం.అర్ర్ధ నక్షత్రంలో అయితే పుత్ర సంసారం.
పునర్వసు నక్షత్రంలో అయితే దుఃఖమైన జీవితం.పుష్యమీ నక్షత్రంలో అయితే కుటుంబానికి వేదన.
అశ్లేష నక్షత్రంలో అయితే సకల శుభాలు.మఘ నక్షత్రంలో అయితే భర్తకి దూరం అవుతారట.
అలాగే పుబ్బ నక్షత్రంలో అయితే మగ సంతానాన్ని పొందుతారట.ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలో అయితే బాగా చూసుకునే పుత్రుడు పుడతాడట.
హస్త నక్షత్రంలో అయితే అఖండ అదృష్టాన్ని పొందుతారట.చిత్త నక్షత్రంలో అయితే చక్కటి జీవితం.
స్వాతి నక్షత్రంలో అయితే భర్త ప్రేమ అపారంగా పొందుతారట.విశాఖ నక్షత్రంలో అయితే నలుగురూ ఈర్ష్యపడే దాంపత్యాన్ని పొందుతారట.
అనురాధ నక్షత్రంలో అయితే రోగాలమయమట.జ్యేష్ఠ నక్షత్రంలో అయితే ధన నష్టంతో పాటు చపల చిత్తం.
అలాగే మూల నక్షత్రంలో అయితే ఈతి బాధలు, ఆరోగ్య బాధలు ఎక్కువవుతాయట.పూర్వాషాఢ నక్షత్రంలో అయితే కుటుంబానికి ఆవేదన.
ఉత్తరాషాఢ నక్షత్రంలో అయితే సంతోషకర జీవితాన్ని సొంతం చేసుకుంటారట.శ్వరణా నక్షత్రంలో అయితే అధికార ఆనందం.
ధనిష్ఠ నక్షత్రంలో అయితే ఆయురారోగ్యాలను సొంతం చేసుకుంటారు.శతభిష నక్షత్రంలో అయితే ఆకలి బాధలు ఎక్కువటచ.
అలాగే పూర్వాభాద్రపదం లో అయితే శక్తి లేకపోవడం.ఉత్తర భాద్రపదంలో అయితే పది మంది మెచ్చుకునే జీవితం.
రేవతి నక్షత్రంలో అయితే సకాల శుభాలను పొందుతారని మన పురాణాలు చెబుతున్నాయి.
తిరిగి సినిమాల్లోకి వస్తానంటే వద్దన్నారు.. జెనీలియా సంచలన వ్యాఖ్యలు వైరల్!