అడ్వకేట్, లాయర్ కు మధ్య తేడా ఏంటో తెలుసా..?!

చాలా మందికి లాయర్ అన్నా, అడ్వేకెట్ అన్నా ఒక్కరే అని అభిప్రాయపడుతుంటారు.కానీ లాయర్, అడ్వేకెట్ అర్ధం ఒక్కటే అయిన ఆ పదాలకు మధ్య తేడా ఉంది.

నిజం చెప్పాలంటే వీరిద్దరూ ఒక్కటి కాదు.మరి ఏంటి వాళ్ళ మధ్య డిఫరెన్స్ అని అనుకుంటున్నారా.

? సాధరణంగా మనం ఏదన్నా కేసులో ఇరుక్కుంటే.ఆ కేసు నుండి తప్పించుకోవడానికి లాయర్ సలహా అడుగుతాము.

అదే ఆ కేసు కోర్టు దాక వెళితే మాత్రం ఆ కేసును వాదించడానికి అడ్వేకెట్ ను పెట్టుకుంటాము.

అంటే లాయర్ కేవలం సలహాలు, సజెషన్స్ మాత్రమే ఇస్తాడు అన్నమాట.అదే అడ్వేకెట్ అయితే కోర్టులో కేసును వదిస్తాడన్నమాట.

ఇంకా అర్ధం కాకపోతే వారి ఇద్దరి మధ్య గల తేడా ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఎవరయినా సరే లా కంప్లీట్ చేసిన తర్వాత బ్యాచిలర్ ఆఫ్ లెజిస్లేటివ్ లా లో (LLB) డిగ్రీ అందుకుంటే వారిని మనం లాయర్ అని మాత్రమే అంటాము.

అలాగే డిగ్రీ అయ్యాక ఆ లాయర్ భారతదేశంలో గల న్యాయస్థానంలో ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే, వారు తప్పకుండా స్టేట్ బార్ కౌన్సిల్ లో ఎన్రోల్ చేసుకోవాలి.

ఆ తరువాత ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (AIBE) కూడా రాసి పాస్ అయి ఉండాలి.

అప్పుడు ఆ లాయర్ కొన్నాళ్ల పాటు ఒక అడ్వకేట్ దగ్గర ప్రాక్టీస్ మొదలుపెట్టాలి.

అంటే LLB డిగ్రీ ఉండి, బార్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినవారిని మాత్రమే అడ్వకేట్ అని అంటారు.

LLB అయ్యి బార్ పరీక్ష క్లియర్ చేయని వాళ్ళని లాయర్ అంటాము.అలాగే లాయర్లు న్యాయపరమైన సలహాలు మాత్రమే ఇస్తారు.

అంతేకాని వారు కోర్ట్ లో ఒక క్లయింట్ తరపున వాదించలేరు.అదే అడ్వకేట్ అయితే కోర్టులో ఒక క్లైంట్ తరుపున వాదించగలుగుతారు.

అడ్వకేట్ కోర్టులో ఎన్నో కేసులు వాదించడం వలన అనుభవం ఎక్కువగా ఉంటుంది.లాయర్ కి అనుభవం తక్కువగా ఉంటుంది.

అందుకే న్యాయస్థానంలో ఒక క్లయింట్ తరపున వాదించడానికి అనుభవం కావాలి కాబట్టి అడ్వకేట్ దగ్గర లాయర్ ప్రాక్టీస్ చేయవలిసి ఉంటుంది.

అలాగే అడ్వకేట్ తో పోలిస్తే లాయర్ ఫీజు కూడా తక్కువగా ఉంటుంది.

కాగా ఎవరయినా గాని ఇంగ్లాండులో, సౌత్ ఆఫ్రికాలో, లేదా స్కాట్ ల్యాండ్ వంటి ఇతర దేశాలలో లా చదివి వస్తే వారిని బారిష్టర్ అని కూడా పిలుస్తారు.

బారిస్టర్ కూడా అడ్వకేట్ తో సమానమే.బారిస్టర్ అనగానే మన చిన్నప్పుడు తెలుగులో మనం చదివిన బారిష్టర్ పార్వతీశం కధ గుర్తుకు వస్తుంది కదా.

Viral Video: టీచర్‌ పై చెప్పులు విసిరిన విద్యార్థులు.. అసలెందుకు అలా చేసారంటే..?!