అనంత్ అంబానీ రిసెప్షన్ ఉపాసన ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇటీవల జరిగిన అనంత్ అంబానీ( Ananth Ambani ) రాధిక మర్చంట్ ( Radhika Marchant ) వివాహపు వేడుకలలో భాగంగా సినీ తారలు పెద్ద ఎత్తున సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సౌత్ ఇండియన్ స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొని సందడి చేశారు.

ప్రస్తుతం వీరి వివాహం పూర్తి అయినప్పటికీ ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనగా మారాయి.

ఇక ఈ వివాహ వేడుకలలో భాగంగా సినీ స్టార్స్ అందరూ కూడా ఒకే చోట కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

"""/" / ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మెగా కపుల్స్ రామ్ చరణ్( Ramcharan ) ఉపాసన (Upasana) దంపతులు కూడా ఈ పెళ్లి వేడుకలలో పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే.

వీరిద్దరూ గతంలో జామ్ నగర్ లో జరిగిన ఫ్రీ వెడ్డింగ్ వేడుకకు కూడా హాజరయ్యారు.

ఇక పెళ్లి వేడుకలలో కూడా ఉపాసన రాంచరణ్ దంపతులు పాల్గొని సందడి చేశారు.

ఈ దంపతులకు అంబానీ ఫ్యామిలీ ఎంతో అద్భుతమైన స్వాగతం పలికారు.ఇలా ప్రతి ఒక్క సెలబ్రిటీని కూడా ఎంతో మర్యాదపూర్వకంగా స్వాగతిస్తూ వారి గొప్పతనాన్ని చాటుకున్నారు.

"""/" / ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా ఉపాసన తన అమ్మ చీరను రీ మోడల్ చేయించి ధరించిన సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే రిసెప్షన్ వేడుకలో భాగంగా ఉపాసన ధరించిన డ్రెస్ సైతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది అయితే ప్రస్తుతం ఈమె వేసిన ఈ డ్రెస్ ఖరీదు గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ రిసెప్షన్ కార్యక్రమంలో భాగంగా ఉపాసన జయంతి రెడ్డి రూపొందించిన బీజ్ ఎంబ్రాయిడరీ సిల్క్ అనార్కలి సెట్ ను ధరించారు.

ఈ సెట్ ధర అక్షరాల రూ, 1.49 లక్షలు అని తెలియడంతో ఒక్కసారిగా నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

 .

పేరెంట్స్ విడాకులు.. మేము కూడా మనుషులమే.. అక్షర హాసన్ కామెంట్స్ వైరల్!