సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసా..?

హిందూ ధర్మం లో ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడికి( Surya Bhagavan ) విశిష్ట స్థానం ఉంది.

సూర్యోదయం లో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం ఎంతో పుణ్యమని పెద్దవారు చెబుతూ ఉంటారు.

అలాగే మతపరమైన ఆధ్యాత్మిక దృక్పథంతో పాటు అర్ఘ్యం ప్రాముఖ్యత మానసిక దృక్కోణంతో కూడా తెలిపారు.

ప్రతిరోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని ప్రజల నమ్మకం.

అంతే కాకుండా వ్యాధులు దరిచేరవని నమ్మకం.ప్రతి రోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ ధర్మంలో సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం సూర్య భగవానుడి పట్ల భక్తి కృతజ్ఞతలకు చిహ్నం గా ప్రజలు భావిస్తారు.

అదే సమయంలో శాస్త్రీయ దృక్కోణంలో శరీరం సూర్యరశ్మి నుండి విటమిన్ డీ( Vitamin D ) నీ శరీరంలో గ్రహిస్తుంది.

సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించే సమయంలో చేయి దోసిలి పడతారు. """/" / ఇది వినయం, అంకితభావం, దీవెనలు పొందెందుకు చిహ్నంగా భావిస్తారు.

వినయం ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి దారితీస్తుందని నమ్ముతారు.సూర్యోదయం సమయంలో సూర్యరశ్మి శరీరానికి తగలడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ప్రజల నమ్మకం.

అలాగే హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి రోజు సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఆ వ్యక్తి శరీరం వ్యాధి రహితంగా ఉంటుంది.

ఇలా చేసేవారు త్వరగా వ్యాధుల( Diseases ) బారిన పడకుండా ఉంటారు. """/" / అర్ఘ్య సమర్పణ ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా శుద్ధి చేస్తుంది.

అలాగే ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది.స్వచ్ఛత పొందిన అనుభూతిని కలిగిస్తుంది.

భూమిపై జీవితాన్ని కొనసాగించడంలో సూర్యుడు ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని కచ్చితంగా చెప్పవచ్చు.అటువంటి పరిస్థితులలో అర్జున్ సమర్పించడం ద్వారా సూర్యుడికి కృతజ్ఞతలు తెలపాలి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : హాట్ హాట్‌ ట్రంప్ – బైడెన్ డిబేట్ .. ఇద్దరూ తగ్గట్లేదుగా ..!!