Curry Leaves : రోజు ఉదయం కరివేపాకు నీటిని తాగితే ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసా?

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ నిత్యం కరివేపాకు( Curry Leaves )ను వాడుతుంటారు.

వంటల రుచిని పెంచడానికి కరివేపాకు ప్రసిద్ధి చెందింది.అయితే రుచిని పెంచే సామర్థ్యమే కాదు కరివేపాకులో ఎన్నో విలువైన పోషకాలు సైతం నిండి ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యపరంగా కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఉదయం కరివేపాకు నీటిని తాగితే ఊహించని ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

పైగా కరివేపాకు నీటిని తయారు చేసుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త అవ్వగానే అందులో మూడు రెబ్బలు కరివేపాకు వేసి కనీసం 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి.

బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.

ఈ కరివేపాకు వాటర్ ను రోజు ఉదయం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

"""/" / ప్రధానంగా చూసుకుంటే కరివేపాకు వాటర్ వెయిట్ లాస్( Weight Loss ) కు తోడ్పడుతుంది.

ఈ వాటర్ లో ఉండే బయో యాక్టివ్ సమ్మేళనాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అతి ఆకలిని దూరం చేస్తాయి.

కొవ్వును సమర్థవంతంగా క‌రిగించి వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తాయి.అలాగే రోజు ఉదయం కరివేపాకు నీటిని తాగితే మధుమేహం వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుంది.

ఒకవేళ మధుమేహం ఉంటే కనుక రక్తంలో చక్కెర స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.

కరివేపాకు వాటర్ జీర్ణక్రియ( Digestion )ను చురుగ్గా మారుస్తుంది.గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.

</br """/" / అలాగే కొందరు శ్వాస సమస్యలతో బాధపడుతుంటారు.శ్వాస తీసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు.

అలాంటివారు కరివేపాకు నీటిని నిత్యం తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.కరివేపాకు నీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

అవి శ్వాస కోశలో అడ్డంకులను తొలగిస్తాయి.శ్వాస సమస్యలను దూరం చేస్తాయి.

అంతేకాదు నిత్యం కరివేపాకు నీటిని తీసుకోవడం వల్ల కంటి చూపు రెట్టింపు అవుతుంది.

రక్తహీనత సమస్య ఉంటే దూరం అవుతుంది.జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.

ఇన్ని ప్రయోజనాలు అందించే కరివేపాకు నీటిని రోజూ తాగడం అస్సలు మిస్ అవ్వకండి.

రాజమౌళికి పోటీగా మారుతున్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. ఇద్దరిలో నంబర్ వన్ ఎవరు?