అభ్యంగన స్నానం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..?

సాధారణంగా ఏదైనా పండుగలు లేదా ప్రత్యేక రోజులలో స్నానం కూడా ఎంతో ప్రత్యేకంగా చేస్తారు.

స్నానం చేయటం గురించి ప్రత్యేకంగా వస్తు గుణ దీపికలో తలంటు స్నానం గురించి ఎంతో చక్కగా వివరించబడింది.

ముఖ్యంగా పండుగల సమయంలో అనగా సంక్రాంతి వంటి పండుగ రోజులలో తలస్నానానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.

తలంటు స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అని పిలుస్తారు.ఈ అభ్యంగన స్నానం కోసం కొబ్బరి నూనె ,ఆవ నూనె, నువ్వుల నూనెను ఉపయోగిస్తారు.

ముందుగా అభ్యంగన స్నానం చేయడానికి నూనెలలో ఏదైనా ఒక దానిని ఉపయోగించి శరీరం మొత్తం బాగా రాసి మర్దన చేయాలి.

శరీరం మొత్తం మర్దన చేసిన 10 నిమిషాల తర్వాత సున్నిపిండితో శరీరం మొత్తం నలుగు పెట్టాలి.

ఒక 10 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో తలంటు స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అని అంటారు.

ఈ విధంగా అభ్యంగన స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని మన పెద్ద వారు చెబుతుంటారు.

ఈ అభ్యంగన స్నానం వల్ల శరీరంలో ఏర్పడిన గజ్జి,చిడుము,సర్పి, వంటి చర్మ రోగాలు తొలగిపోతాయి.

మన శరీరంపై ఉన్న మలినాలు తొలగి పోవడం వల్ల శరీరం నుంచి ఎటువంటి దుర్గంధం వెలువడదు.

అదేవిధంగా మన శరీరం తేలికగా ఉండటంవల్ల సుఖనిద్ర వస్తుంది.దీని వల్ల ఎలాంటి చెడు కలలు దరిచేరవు.

ఈ విధంగా నూనెలతో బాగా మర్ధన చేసి సున్నిపిండితో నలుగు పెట్టడం వల్ల శరీరం కాంతివంతంగా ఉండడమే కాకుండా, కళ్లకు ఎంతో చలువ చేస్తుంది.

"""/" / ఈ రకమైనటువంటి అభ్యంగన స్నానం వల్ల కాళ్ళు, చేతులు మంటలు తగ్గిపోతుంది.

అభ్యంగన స్నానం కేవలం పండుగలు లేదా పెళ్లి పుట్టిన రోజు వంటి ప్రత్యేక రోజులలో మాత్రమే నిర్వహిస్తుంటారు.

అభ్యంగన స్నానం చేయటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయి కాబట్టే మన పూర్వీకులు ఈ స్నానానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు.

కాకపోతే ప్రస్తుత కాలంలో ఇలాంటి ఆచారవ్యవహారాలు పాటించలేకపోవటం వల్ల మన శరీరాన్ని కూడా అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.

ఈ విధంగా అభ్యంగన స్నానం వారంలో కనీసం ఒకరోజు అయినా చేయడం వల్ల శరీర వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చని మన పెద్దవారు చెప్తుంటారు.

పుష్ప2 లో ఆ సీన్ వల్ల నరకం చూసిన అల్లు అర్జున్.. వామ్మో ఇంత కష్టపడ్డారా?