Animal Movie: అనిమల్ మూవీ లో రణబీర్ కపూర్ సోదరిగా చేసిన అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా..?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా చేస్తున్న యానిమల్ మూవీ ( Animal Movie ) పై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెంచుకున్నారు అభిమానులు.

ఈ సినిమా దాదాపు మూడున్నర గంటల డ్యూరేషన్ తో రాబోతుంది.అయితే ఎక్కువ నిడివి ఉంది కాబట్టి ఈ సినిమా ప్లాఫ్ అవుతుంది అని కొంతమంది నెగటివ్ ప్రచారం చేసినప్పటికీ ట్రైలర్ చూసిన అందరికీ మైండ్ బ్లాక్ అయింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని భావిస్తున్నారు.ఇక ఈ సినిమాకి దర్శకుడిగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga ) చేస్తున్నారు.

అలాగే నేషనల్ క్రష్ రష్మికా మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

ఇప్పటికే వీరికి సంబంధించిన పోస్టర్, ట్రైలర్, టీజర్ అందరినీ అలరించింది.అయితే ఈ సినిమా డిసెంబర్ 1 న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతుంది.

"""/" / అదేంటంటే ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే కచ్చితంగా ఆ సినిమాలో కొంతమంది తెలియని ఆర్టిస్టులు పరిచయం చేస్తారు.

అయితే వారి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలని నెటిజన్స్ అందరూ ఆరా తీస్తూ ఉంటారు.

ఇక ప్రస్తుతం యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) సోదరిగా చేసిన ఆ అమ్మాయి ఎవరు అంటూ చాలామంది నెటిజన్లు ఆమె గురించి ఆరా తీస్తున్నారు.

ఇక హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోని ఆ అమ్మాయి పేరు సలోని బాత్రా.

ఆమె ఈ సినిమా కంటే ముందే కొన్ని వెబ్ సిరీస్ లు అలాగే కొన్ని సీరియల్స్ లో నటించిందట.

"""/" / ఫ్యాషన్ డిజైనర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మాలిని అగర్వాల్ దగ్గర స్టైలిస్ట్ గా చేరింది.

తైష్, పర్చాయే ఘోస్ట్ స్టోరీస్,వైట్ మ్యాటర్స్ వంటి సినిమాల్లో కూడా సలోని నటించింది.

ఇలా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్, సీరియల్స్ వంటివి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సలోని బాత్రా సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటుంది.

ఇక హీరోయిన్ కి ఏమాత్రం తీసిపోని సలోని బాత్రా ( Saloni Batra ) నటనకు ఫిదా అయిన చాలామంది దర్శకులు తమ సినిమాల్లో పెట్టుకుంటున్నారు.

‘వరల్డ్స్ డెడ్లీస్ట్ రోడ్’ గుండా జీప్ రైడ్.. ఈ భయానక వీడియో చూస్తే..??