సినిమాల్లో సైడ్ విలన్గా నటించే ఈయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే సుమీ?
TeluguStop.com
సాధారణంగా సినిమాల్లో మెయిన్ విలన్స్ ఎక్కువగా స్పెషల్ ఎట్రాక్షన్ గా మారి పోతూ ఉంటారూ.
కానీ కొన్నిసార్లు మాత్రం మెయిన్ విలన్ వెనకాల ఉండే కొంతమంది చోటా చోటా విలన్లు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే.
కాగా అలాంటి వారిలోనే షేక్ శ్రీను కూడా ఒకరు.దాదాపు ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు.
కానీ ఈయన ఫోటో చూస్తే మాత్రం ఓ ఇతనేనా ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది.
ఎందుకంటే ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో ఆయన చూశాం విలనిజంతో నే కాదు తన బాడీతో కూడా ఎంతో మంది ప్రేక్షకులకు ఆకట్టుకున్నారు షేక్ శ్రీను.
అయితే ఇలా సైడ్ క్యారెక్టర్ లో కనిపించినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న షేక్ శ్రీను గురించి కొన్ని విషయాలు తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వకుండా ఉండలేరు.
షేక్ శ్రీను కి బాడీ బిల్డింగ్ అంటే ఎంతో ఇష్టమట.ఈ క్రమంలోనే బాడీ బిల్డింగ్ లో ఏకంగా నేషనల్ స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు.
చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్, మెగాస్టార్ నటన చూసి ఇక ఎంతో ఇష్టపడి వాళ్ళని అభిమానించడం మొదలు పెట్టారట.
తర్వాత సినిమాల్లోకి రావాలని ఆశ కూడా కలిగింది.ఇక జాకీచాన్, హీరో అర్జున్ ను చూసిన తర్వాత చాలా సినిమాల్లో విలన్ గా రాణించాలని కోరిక కలిగిందట.
"""/"/
ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీకి రావడానికి సినీ ఆర్టిస్ట్ ప్రసన్నకుమార్ కారణం అంటూ పలు ఇంటర్వ్యూలలో షేక్ శ్రీను చెప్పుకొచ్చారు అయితే బాలయ్య హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నరసింహ నాయుడు సినిమా షేక్ శ్రీను కు మొదటి సినిమానట.
ఫైట్ మాస్టర్లు గా వ్యవహరించిన రామ్ లక్ష్మణ్ దృష్టిలో పడడం ద్వారా షేక్ శ్రీను ని సినిమాల్లో కంటిన్యూ చేస్తూ వచ్చారు.
ఇక ఇతని అసలు పేరు షేక్ రెహమాన్.భద్ర, ఆప్తుడు, మిర్చి జయ జానకి నాయక లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నాడు.
అయితే ఈయన గురించి ఎవరికి తెలియని విషయం ఏమిటంటే ఈయన వైజాగ్ లో పోలీస్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉండటం గమనార్హం.
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?