40 ఏళ్లకొకసారి దర్శనమిచ్చే అత్తివరదరాజ స్వామి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
TeluguStop.com
ఆలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని కాంచీపురం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు.
అయితే వెయ్యికి పైగా దేవాలయాలు ఉన్న ఆధ్యాత్మిక ప్రాంతం.నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడకు తరలి వస్తుంటారు.
సాధారణంగానే సందడిగా కనిపించే కంచి.ఇప్పుడు మరింత కళ సంతరించుకుంది.
భక్తుల సంఖ్య వేలు దాటి లక్షలకు చేరింది.కారణం.
దివ్య మంగళ స్వరూపమైన అత్తి వరదరాజ స్వామి విగ్రహం.జలం వీడి జనంలోకి రావటమే.
! 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే కనిపించే ఈ అరుదైన దృశ్యం చూసేందుకు.
భక్తులు దేశ నలుమూలల నుంచి కంచికి వస్తుంటారు.జీవితంలో ఒక్కసారి అయినా స్వామివారి తేజోమయమైన రూపం చూడాలని.
వేయి కళ్లతో నిరీక్షిస్తుంటారు.భక్తులకు వరాలు ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చిన కథలు మనం విన్నాం.
కానీ ఈయన చాలా ప్రత్యేకం.40 ఏళ్ల ఎదురు చూపులకు తెర దించాడు.
నీటి నుంచి పైకి వచ్చి మరి అనుగ్రహిస్తున్నాడు.తమిళుల ఆరాధ్య దైవంగా, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా కాంచీపురంలో కొలువైన వరదరాజ పెరుమాళ్ కథ ఇది.
పూర్వం యుద్ధం జరిగే సమయంలో ఆలయాలకు, దేవతా విగ్రహాలకు తగిన రక్షణ ఉండేది కాదు.
ఆలయంలోని మూల విరాట్టును రక్షించుకునేందుకు అర్చకులు ఇలా భూమిలో దాచారని.ఆఫద సమయం ముగిసిన తర్వాత ఆ విగ్రహం బయటకు తీసి పూజించేవారని చెబుతుంటారు.
అత్తివరదరాజు స్వామిని భూమి లోపల దాచే సమయంలో ఏర్పడ్డ గుంత పుష్కరణిగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది.
పురాణాలు మాత్రం యాగ గుండం నుంచి అ్తతి వరదన్ పుట్టినట్లు చెబుతున్నాయి.మత్స్యావతారం ఎత్తి నీటిలో దాగి ఉన్న సోమకుడిని వధించి వేదాలు కాపాడిన విష్ణువు కాంచీపురంలో అత్తివరద రాజు స్వామిగా నీటి కొలనులో విశ్రమిస్తాడని మరో పురాణ ప్రతీతి.
ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రభాస్ హీరోయిన్.. కారు ఖరీదు ఎంతో తెలుసా?