భారత్ నుంచి విదేశాలకు వెళ్లే 7 రైళ్లు మీకు తెలుసా? వివరాలు ఇవే!

మనదేశంనుండి విదేశాలకు వెళ్లాలంటే కేవలం విమానం మాత్రమే ఒక ఆప్షన్ అని అందరూ అనుకుంటారు.

అయితే, మనదగ్గరనుండి కొన్ని దేశాలకు వెళ్లాలంటే విమానం ఎక్కాల్సిన అవసరమే లేదని ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే.

మనదేశం నుంచి కొన్ని పొరుగు దేశాలకు వెళ్లేందుకు విమానం మార్గం కాకుండా రైలు మార్గం కూడా ఉంది.

అలాంటి రైల్వే స్టేషన్లు.దేశంలో ఏకంగా 7 వున్నాయి.

ఇక్కడ రైళ్లు నేరుగా విదేశాలకు వెళ్తాయి.'అటారీ' గురించి అయితే అందరికీ తెలిసిందే.

మిగిలిన 6 స్టేషన్ల గురించి మాత్రం 90 శాతానికి పైగా ప్రజలకు అవగాహన లేదు.

అవేమిటో చూద్దాం>./br> """/" / అందులో మొదటిది 'హల్దీబారి.

' ఇది పశ్చిమ బెంగాల్‌( West Bengal )లోని న్యూ జల్పాయ్ గుడి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేకంగా నిర్మింపబడింది.

ఇది బంగ్లాదేశ్ ( Bangladesh )నుండి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే.

ఇక్కడ నుండి తేలికగా బంగ్లాదేశ్ వెళ్ళవచ్చు.రెండవది 'జై నగర్.

' ఈ స్టేషన్ బీహార్‌లోని మధుబనిలో ఉంది.ఇక్కడి నుంచి నేపాల్‌కు డైరెక్ట్ గా రైళ్లు వున్నాయి.

ఇక్కడి నుండి ఇంటర్ ఇండియా-నేపాల్ రైలు నడుస్తుంది.చుట్టుపక్కల ప్రజలు నేపాల్ వెళ్లేందుకు ఈ రైలు సహాయం తీసుకుంటారు.

ఇక 3వది 'పెట్రాపోల్.' ఈ స్టేషన్ నుండి బంగ్లాదేశ్‌కు వెళ్లవచ్చు.

ఈ స్టేషన్ ప్రధానంగా 2 దేశాల మధ్య దిగుమతి, ఎగుమతి కోసం ఉపయోగించబడుతుంది.

/br> """/" / ఈ లిస్టులో నాల్గవ స్టేషన్ 'సింగాబాద్.' ఈ స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఉంది.

ఇక్కడి నుండి కూడా బంగ్లాదేశ్‌కు రైళ్లు అందుబాటులో ఉన్నాయి.తరువాతది 'జోగ్బాని.

' ఇది బీహార్‌లోని ఒక జిల్లా.ఈ స్టేషన్ నేపాల్‌కి చాలా దగ్గరగా ఉంది, అయితే ఇక్కడనుండి నేపాల్ వెళ్ళడానికి రైలు కూడా ఎక్కాల్సిన అవసరం లేదు.

కాలినడకన నేపాల్( Nepal ) చేరుకోవచ్చు.అదేవిధంగా 'రాధికాపూర్' గురించి చెప్పుకోవాలి.

ఈ స్టేషన్ సరుకు రవాణా కోసం మాత్రమే.ఈ స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లో ఉంది, ఇక్కడ నుండి బంగ్లాదేశ్‌కు రైళ్లు వున్నాయి.

చివరగా మాట్లాడుకోవలసింది 'అట్టారి స్టేషన్.' ఇది పంజాబ్‌లోని అత్యంత ప్రసిద్ధ స్టేషన్.

ఇక్కడి నుంచి సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పాకిస్థాన్‌కు వెళుతుంది.వారానికి 2 రోజులు నడుస్తుంది.

రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా మీద ఎక్కువ ఫోకస్ పెట్టనున్నాడా..?