జూనియర్ ఎన్టీయార్ మిస్ చేసుకున్న ఆ సూపర్ హిట్ సినిమా ఏంటో తెలుసా..?

నందమూరి ఫ్యామిలీ మూడో తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్.

( Jr NTR ) తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

ఇక ఈ తరం లో నందమూరి ఫ్యామిలీ బరువు భాద్యతలను మోస్తున్న నటుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే కావడం విశేషం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి.

సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లోనే మాస్ సినిమాలను చూసి అప్పట్లో స్టార్ హీరో గా ఉన్న చిరంజీవికి సైతం పోటీని ఇచ్చిన ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్.

20 సంవత్సరాల వయసులోనే సూపర్ హిట్స్ అందుకున్న ఏకైక హీరో కూడా జూనియర్ ఎన్టీఆర్ కావడం విశేషము.

ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తన కెరియర్ లో చాలా మంచి సినిమాలను వదిలేసుకున్నాడు.

కారణం ఏదైనా కూడా అలాంటి సినిమాలను వదిలేసుకోవడం వల్ల ఆయన స్టార్ డమ్ అనేది కూడా భారీగా పడిపోయింది.

ఆయన సక్సెస్ఫుల్ సినిమాలను జడ్జిమెంట్ చేయలేక ఫెయిల్యూర్ సినిమాలను ఎంచుకొని చేయడం వల్ల అవి సరిగ్గా ఆడలేదు.

అందుకే ఆయన కెరీర్ అనేది ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకడిగా ఉంది.లేకపోతే ఆయన ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా ఎప్పుడో మంచి గుర్తింపు సంపాదించుకునే వాడు.

ఇక ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ డాన్స్, ఫైట్స్ చేయడం లో అలాగే డైలాగులు చెప్పడంలో అతని మించిన వాళ్లు ఎవరూ లేరు.

"""/" / సింగిల్ టెక్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న ఆయన రీసెంట్ గా దేవర సినిమాతో( Devara Movie ) మంచి సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా వచ్చిన మగధీర సినిమాని( Magadheera ) మొదట జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలని రాజమౌళి అనుకున్నారట.

కానీ జూనియర్ ఎన్టీఆర్ కి అప్పుడున్న మార్కెట్ ను బట్టి ఆయన మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవ్వదనే ఉద్దేశ్యంతోనే రాజమౌళి( Rajamouli ) రామ్ చరణ్ తో ఈ సినిమాని ప్లాన్ చేశాడు.

మరి రామ్ చరణ్ కి కూడా అప్పటి వరకు అంత మార్కెట్ అయితే లేదు.

కానీ చిరంజీవి కొడుకు అనే ఒక ఇమేజ్ అయితే ఉంది. """/" / దానివల్ల ప్రేక్షకులు చాలామంది థియేటర్ కి రావడమే కాకుండా ఆ సినిమాను బ్లాక్ బాస్టర్ చేస్తారనే నమ్మకం రాజమౌళి లో ఉంది.

కాబట్టే ఆ సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.ఇక అలా జూనియర్ ఎన్టీఆర్ ఒక సూపర్ సక్సెస్ ని మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.

ఇక ఏది ఏమైనప్పటికీ రాజమౌళి ఎన్టీయార్ తో ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేయడం అనేది విశేషం.

వీళ్ళ మధ్య ఉన్న మంచి బాండింగ్ వల్లే వీళ్ళు వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..