కొరటాల శివ, బి వి ఎస్ రవి ఇద్దరు రైటర్లుగా చేసిన ఆ చిన్న సినిమా ఏంటో తెలుసా…
TeluguStop.com
కొరటాల శివ ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో వాళ్ళ రిలేషన్ అయిన పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా జాయిన్ అయ్యాడు అక్కడే చాలా కాలం పాటు పనిచేస్తూ వర్క్ నేర్చుకున్నాడు.
అలాగే కొరటాల బి వి ఎస్ రవి ఇద్దరు కాలేజ్ లో క్లాస్మేట్స్ అలాగే మంచి ఫ్రెండ్స్ కూడా దాంతో రవి కి కూడా సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడం తో కొరటాల సహాయం తో పోసాని దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు.
రవి కూడా మంచి టాలెంటెడ్ రైటర్ వీళ్లిద్దరూ చాలా కాలం పాటు పోసాని దగ్గర వర్క్ చేశారు.
ఇక పోసాని నుంచి బయటికి వచ్చి వాళ్ళు ఓన్ ట్రయల్స్ లో ఉన్నప్పుడు డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి పరిచయం అయ్యాడు అప్పటికే ఆయన 6 టీన్స్ అనే సినిమా తీసి హిట్ కొట్టాడు దాంతో 6 టీన్స్ హీరో అయిన రోహిత్ తోనే తన నెక్స్ట్ సినిమా కూడా చేయాలని ప్లాన్ చేశాడు అందులో భాగం గానే ఆ సినిమాకి కొరటాల శివ బి వి ఎస్ రవి ఇద్దరు కలిసి స్టోరీ అందించారు ఆ సినిమా పేరు ఎంటి అంటే గర్ల్ ఫ్రెండ్.
"""/"/
ఈ సినిమా సూపర్ హిట్ అయింది దాంతో ఇద్దరికీ కూడా రైటర్ గా మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత ఇద్దరు కూడా వేరే వేరే సినిమాలతో బిజీ అయిపోయారు బివీస్ రవి సుమంత్ తో సత్యం సినిమాకి డైలాగ్ రైటర్ గా చేసాడు.
కొరటాల మాత్రం బోయపాటి తో భద్ర సినిమాకి వర్క్ చేశాడు ఆ తర్వాత కొరటాల ప్రభాస్ తో మిర్చి సినిమా చేసి డైరెక్టర్ గా మారాడు అలాగే మహేష్ బాబు తో ఎన్టీయార్ తో చిరంజీవి లతో సినిమాలు చేసి మంచి హిట్లు అందుకున్నాడు.
"""/"/
రవి కూడా గోపి చంద్ వాంటెడ్ మూవీ తో డైరెక్టర్ అయినప్పటికీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు దాంతో సాయి ధరమ్ తేజ్ తో జవాన్ సినిమా చేసినప్పటికీ అది కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ప్రస్తుతం రైటర్ గానే ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం బాలయ్య చేస్తున్న ఆన్ స్టాపబుల్ షో కి రైటర్ గా కూడా చేస్తున్నాడు.
ఓ వైపు కలెక్టరేట్ లో కీలక సమావేశం.. మరోవైపు ఫోన్లో రమ్మీ ఆడుతున్న అధికారి