10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినా ఆఫర్ రిజెక్ట్ చేసిన బన్నీ.. ఈ స్టార్ హీరో వేరే లెవెల్!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu Arjun) గురించి మనందరికీ తెలిసిందే.పుష్ప (Pushpa )సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు బన్నీ.

ఈ సినిమాతో బన్నీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.అంతేకాదు పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 (Pushpa 2)సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. """/" / ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కళ్ళు కాయలు కాచే విధంగా ఎదురుచూస్తున్నారు బన్నీ ఫ్రెండ్స్.

అయితే పుష్ప మూవీ తర్వాత బన్నీతో తమ ఉత్పత్తులను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసేందుకు ఎన్నో కంపెనీలు పోటీపడ్డాయి.

ఆ సమయంలో కొన్ని యాడ్స్ కూడా చేశారు బన్నీ.కానీ ఒక అంతర్జాతీయ సంస్థకు ఆఫర్ మాత్రం సున్నితంగా రిజెక్ట్ చేశారట.

సదరు సంస్థ నిమిషం యాడ్ కోసం రూ.10 కోట్లు ఆఫర్ చేసినా అసలు చేయనని చెప్పేశారట.

పుష్ప ది రూల్(Pushpa The Rule) విడుదలైన తర్వాత అల్లు అర్జున్‌కి తెలిసిన పొగాకు బ్రాండ్ టెలివిజన్ వాణిజ్య ప్రకటనను ఆఫర్ చేసిందట.

"""/" / అందుకు సుమారు రూ.10 కోట్లు ఆఫర్ చేశారట.

కేవలం 60 సెకండ్లు మాత్రమే తమ యాడ్ లో కనిపించాలని రిక్వెస్ట్ చేశారట.

కానీ ఆ ఆఫర్ ను బన్నీ సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం.మద్యం, పొగాకు వంటి ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ప్రకటనలలో నటిస్తే తన అభిమానులను, శ్రేయోభిలాషులకు చెడును వ్యాప్తి చేసినట్లు అవుతుందని అన్నారట.

అందుకు తనకు ఎంతో రెమ్యునరేషన్ ఇచ్చినా చేయనని అన్నారట.మే31న ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవ సందర్భంగా బన్నీ తీసుకున్న ఈ సూపర్ డెసిషన్ న్యూస్ మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది.

అయితే ఈ వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.

వీడియో వైరల్: పాకుతూ వచ్చిన ఏనుగు.. ఎందుకంటే..?