జిన్నా కోసం సన్నీలియోన్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

ఇలా మంచు విష్ణు కెరియర్ మొదట్లో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందారు.

అయితే గత కొంతకాలం నుంచి విష్ణు నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి.

అయినప్పటికీ విష్ణు మాత్రం పంతం వదలకుండా సినిమాల్లో నటిస్తూ ఉన్నారు.తాజాగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు నటించిన చిత్రం జిన్నా ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రాబట్ట లేక పోయింది.

అయితే ఈ సినిమాని ఉద్దేశపూర్వకంగానే కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తూ సినిమా కలెక్షన్లపై దెబ్బ కొడుతున్నారంటూ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్లుగా పాయల్ రాజ్ పుత్, సన్నీలియోన్ నటించిన విషయం మనకు తెలిసిందే.

ఇలా ఇద్దరు బోల్డ్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఈ సినిమా మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది.

"""/"/ ఈ క్రమంలోనే ఈ సినిమాలో సన్నీలియోన్ నటించడంతో ఈ సినిమా కోసం ఈమె తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలో వస్తున్నాయి.

జిన్నా సినిమా కోసం సన్నీలియోన్ ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది.

సన్నీలియోన్ తెలుగులో చాలా తక్కువ సినిమాలలో నటించిన ఈమెకు విపరీతమైన ఆదరణ ఉంది.

ఈ క్రమంలోనే అదే క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈమెకు ఏకంగా రెండు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

వీడియో: ఆవును అనవసరంగా కర్రతో కొట్టిన వృద్ధుడు.. అది తిరిగి దాడి చేయడంతో..