టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా డ్యూయల్ రోల్ సినిమాల్లో నటించిన హీరో ఎవరంటే?

మామూలుగా అభిమానులు వారి అభిమాన హీరోలను తెరపై చూసినప్పుడు ఊగిపోతూ ఉంటారు.అరుపులు కేకలతో విజిల్స్ తో నానా హంగామా సృష్టిస్తూ ఉంటారు.

మామూలుగా కనిపిస్తేనే రచ్చ రచ్చ చేసే అభిమానులు హీరోలు డ్యూయల్ రోల్ లో కనిపిస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే.

రెండు డిఫరెంట్ వేరియేషన్ లో రెండు రకాల షేడ్స్ ను చూపిస్తూ ఒక్కరే హీరో కష్టపడుతూ రెండు పాత్రలు చేసి అభిమానులను ఎంటర్టైన్ చేసిన వారు చాలామంది ఉన్నారు.

"""/" / ఒకప్పటి హీరోలైన సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ దగ్గర నుంచి ఎన్టీఆర్,రామ్ చరణ్ వరకు ఎంతోమంది సినిమాలలో డ్యూయల్ రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

మరి ఇప్పటివరకు ఏ ఏ హీరోలు డ్యూయల్ రోల్స్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఇప్పటివరకు తెలుగులో ఎక్కువ శాతం డ్యూయల్ రోల్స్ లో నటించిన హీరో నటసార్శభౌమ నందమూరి తారక రామారావు.

సీనియర్ ఎన్టీఆర్ ( Senior NTR )పేరు మీదనే ఆ రికార్డ్ పదిలంగా ఉంది.

ఆయన తన కెరీర్ లో అత్యధికంగా 35 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్ చేశారు.

తెలుగు సినిమాల్లో ఆ రికార్డ్ ఇంకెవరు బ్రేక్ చేయలేకపోయారు. """/" / రామారావు తరువాత ఈ విషయంలో సెకండ్ ప్లేస్ లో ఉన్న హీరో కృష్ణ( Krishna ).

ఆయన 25 సినిమాలకు పైగా డ్యూయల్ రోల్ లో కనిపించి ఫ్యాన్స్ ను మురిపించారు.

అలా అప్పటి హీరోలు ఎక్కువగా డ్యూయల్ రోల్ సినిమాలు చేయగా? ఆ తరువాత కూడా హీరోలు ఈ లెగసీని కంటీన్యూ చేశారు.

బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున ( Balakrishna, Chiranjeevi, Nagarjuna )లాంటి హీరోలు కూడా డ్యూయల్ రోల్ చేసి మెప్పించారు.

యంగ్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ తో పటు రామ్ చరణ్, రామ్ లాంటి హీరోలు కూడా డ్యూల్ రోల్స్ లో మెరిపించారు.

మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ దూరం కావడానికి అసలు కారణం ఇదేనా..?