రేపే వసంత పంచమి.. మరి అమ్మవారికి ఏయే ప్రసాదాలు పెట్టాలో తెలుసా?

ఫిబ్రవరి ఐదో తేదీ శినివారం రోజు అంటే రేపే వసంతి పంచమి.వసంత పంచమినే శ్రీ పంచమి అలాగే మదన పంచమి అని కూడా పిలుస్తారు.

ఇదంతా పక్కన పెడితే రేపు వసంత పంచమిని పురస్కరించుకొని పూజలు, అక్షరాభ్యాసాలు చేసేందుకు భక్తులంతా ఇప్పటికే రెడీ అయి పోయి ఉంటారు.

చాలా మంది జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం ఉన్న బాసరకు వెళ్లేందుకు ఏర్పాట్లు కూడా చేస్కొనే ఉంటారు.

అయితే ఇంట్లో పూజలు చేసుకునే వారు మాత్రం.అమ్మవారికి ఎలాంటి పూలతో పూజ చేస్తే, ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అందరికీ జ్ఞానాన్ని అంద జేసి తల్లి సరస్వతీ దేవి తెల్లని పద్మములో.తెలుపు రంగు వస్త్రాల్లో కూర్చుని ఉంటుంది.

అలాంటి తల్లి దయ మనపై ఉండా లంటే తెల్లని పూలతో పూజించడం మంచి దని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పూజ అనంతరం అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం లేదా నేతితో కూడిన  వంటలను ప్రసాదంగా సమర్పిస్తే మరింత మంచిదట.

అంతే కాదండోయ్ నారి కేళము, అరటి పండ్లు, చెరుకు గడలు కూడా సరస్వతీ దేవికి చాలా ఇష్టమట.

వాటిని కూడా అమ్మ వారికి నివేదిస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయట.మరి అమ్మవారికి ఇష్టమైన తెల్లని పూలు, ఇష్టమైన ప్రసాదాలతో అమ్మ కృష పొందింతే.

అపారమైన జ్ఞానం మీకు మీ పిల్లలకు లభిస్తుంది.మరి ఇంకా ఎందుకు ఆలస్యం రేపే పండుగ కాబట్టి.

పూజకు సిద్ధం కండి.

యూకే : భారతీయ విద్యార్ధుల పెద్దమనసు.. వీడియో గేమ్ ప్రాజెక్ట్ ఆదాయం స్వచ్ఛంద సంస్థలకి