పరమ శివుడి కన్నీటి బిందువులే రుద్రాక్షలా?
TeluguStop.com
రుద్రాక్షలు సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం అని చెబుతుంటారు మన పెద్దలు. అయితే చెట్టుకు కాసే వాటికి అంత మహత్యం, పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అయితే వీటికి సంబంధించి భాగవత పురాణంలో పూర్తి విషయం ఉంది. త్రిలోక సంచారి అయిన నారద మునీంద్రునికి నారాయణ మహర్షి రుద్రాక్షల పవిత్రత గురించి తెలిపాడు.
పూర్వం త్రిపురాసుడు అనే రాక్షసుడు. ప్రజలను విపరీతంగా బాధ పెట్టేవాడు.
కనిపించిన వారందరినీ భయపెడుతా ఆనంద పడేవాడు. అయితే అతని బాధలు బరించలేక దేవతలంతా కైలాసానికి వెళ్లి.
శివుడికి మత బాధను చెప్పుకున్నారట. ఎలాగైనా సరే తమకు విముక్తి కల్గించాలని మొక్కుకున్నారట.
వారి ప్రార్థనను ఆలకించిన శివుడు. అఘోరం అనే మహా అస్త్రాన్ని సృష్టించాడు.
అది మహోజ్వలమైన ఆయుధం. అయితే ఆయుధ ప్రయోగానికి ముందు ఆ పరమ శివుడు ధ్యానంలో కూర్చున్నాడు.
మూడు నేత్రాలను మూసి మనసు నంతా ఒకే దానిపై లఘ్నం చేశాడు. అయితే ఆ సమయంలో మూడు కన్నుల నుంచి కన్నీళ్లు వచ్చాయట.
అలా వచ్చిన కన్నీటి బిందువులే. రుద్రాక్షలుగా మారాయని చెబుతుంటారు.
అయితే మొత్తం 38రకాల రుద్రాక్ష వృక్షాలు ఆవిర్భవించాయట. ఎడమ కన్ను నుంచి వచ్చిన 12 కన్నీటి బిందువులు, కుడి కన్ను నుంచి వచ్చిన 16 కన్నీటి బిందువులు, మూడో కన్ను నుంచి వచ్చిన 10 కన్నీటి బిందువలుతో.
మొత్తం 14 ముఖాల రుద్రాక్ష చెట్లు ఏర్పాడ్డాయి. ఇలా ఉద్భవించినవే రుద్రాక్షలు.
అందుకే వాటికి హిందూ సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది.
క్లాస్‌రూమ్‌లోనే విద్యార్థిపై దాడికి పాల్పడిన టీచర్.. వీడియో వైరల్ కావడంతో?