ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా కట్టిన థియేటర్లకు.. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా?

ఎన్టీ రామారావు.ఈ పేరు చెబితే చాలు ప్రతి తెలుగు ప్రేక్షకుడి మనసు పులకరించి పోతూ ఉంటుంది అని చెప్పాలి.

అంతలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని కీర్తిని సంపాదించుకున్నాడు నందమూరి తారక రామారావు.

తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని హీరోగా ఎదగడమే కాదు అటు రాజకీయాల్లో కూడా ఎన్నో ఏళ్ల పాటు తిరుగు లేని నాయకుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో రెండుథియేటర్లో నిర్మించారనే విషయం తెలిసిందే.

దానికి రామకృష్ణ థియేటర్ అని పేరు కూడా పెట్టారు.స్వర్గస్తులైన తన పెద్ద కుమారుడు పేరు పెట్టారు.

ఇక సినిమా హీరో, రాజకీయ నాయకుడు అయిన ఎన్టీఆర్ థియేటర్లూ నిర్మించడంతో అప్పట్లో ఈ థియేటర్ల పేరు మారుమోగిపోయింది.

అయితే ఇక రాష్ట్రంలోనే తొలి 70 ఎంఎం థియేటర్ గా రామకృష్ణ థియేటర్ రికార్డు సృష్టించింది అని చెబుతూ ఉంటారు.

ఎన్నో తెలుగు సినిమాలలూ ఇక ఈ థియేటర్ వేదికగా ఆడించగా ఇక అటు ఎంతోమంది ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్తున్న ఉండేవారు.

ఇక ఆ తర్వాత ఈ థియేటర్లో కేవలం హిందీ సినిమాలను మాత్రమే ఆడించడం మొదలుపెట్టారూ.

"""/" / రాష్ట్రంలోని ఏ థియేటర్లో హిందీ సినిమా లేకపోయినా రామకృష్ణ థియేటర్ లో మాత్రం ఆడేది.

ఇక ఎన్టీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇక ఈ థియేటర్ లో బూతు సినిమాలు కూడా ఆడించారు అంటూ అప్పట్లో దీనిపై రచ్చరచ్చ కావడం పోలీసుల వరకు వ్యవహారం వెళ్ళింది.

దీంతో కొన్నాళ్లపాటు ఇక సినిమా థియేటర్లు మూత పడిన తర్వాత ఇంద్ర సినిమాస్ థియేటర్ ను కొనుగోలు చేయడంతో ప్రస్తుతం ఈ థియేటర్లు పూర్వ వైభవాన్ని సొంతం తీసుకుని మళ్ళీ ప్రేక్షకులను సినిమాలతో అలరించనున్నాయ్ అని చెప్పాలి.

వాళ్లకు క్షమాపణలు చెప్పిన సంక్రాంతికి వస్తున్నాం బుల్లిరాజు.. అసలేం జరిగిందంటే?